RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
balu sailaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
balu sailaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2024, శనివారం

సుజాతా ఐ లవ్ యూ సుజాతా | Sujatha I Love you Sujatha | Song Lyrics | Gopalarao gari Ammayi (1980)

సుజాతా ఐ లవ్ యూ సుజాతా



చిత్రం: గోపాలరావు గారి అమ్మాయి (1980)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: ఆరుద్ర

నేపథ్య గానం: బాలు, శైలజ 


పల్లవి :


సుజాతా.. ఐ లవ్ యూ

సుజాతా.. ఐ లవ్ యూ.. 

ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ..  సుజాతా


సుజాతా.. ఐ లవ్ యూ సుజాతా

నిజంగా ఐ లైక్ యూ సుజాతా

సుజాతా.. ఐ లవ్ యూ సుజాతా

నిజంగా ఐ లైక్ యూ సుజాతా

ఐ లవ్ యూ సుజాతా.. 

సుజాతా.. సుజాతా.. సుజాతా


సుజాతా...  ఐ లవ్ యూ సుజాతా

నిజంగా..  ఐ లైక్ యూ సుజాతా


చరణం 1 :


వెచ్చగా నులివెచ్చగా.. నే మెచ్చగా చేరవా

చల్లగా జాబిల్లిగా మరుమల్లెగా మారనా

వెచ్చగా నులివెచ్చగా.. నే మెచ్చగా చేరవా

చల్లగా జాబిల్లిగా మరుమల్లెగా మారనా


కన్ను కన్ను కలిపిన నాడే 

పున్నమి వెన్నెల కురిసింది

నిన్ను నన్ను కలిపిన వాడికి 

ప్రేమకు అర్థం తెలిసింది 


నీ పేరే తపిస్తూ..  

జపిస్తూ..  జపిస్తా జపిస్తా


సుజాతా.. హహహా.. 

ఐ లవ్ యూ సుజాతా

నిజంగా .. ఉమ్మ్.. ఉమ్మ్ .. 

ఐ లైక్ యూ సుజాతా


చరణం 2 : 


కొంటెగా క్రీగంటితో నా ఒంటిపై వాలకు

వెంటనే నీ జంటగా జేగంటగా మ్రోగనా

కొంటెగా క్రీగంటితో నా ఒంటిపై వాలకు

వెంటనే నీ జంటగా జేగంటగా మ్రోగనా


నీలో ఏదో నాదం ఉంది 

నన్నే గానం చేసింది 

నీలో ఏదో బంధం ఉంది 

నన్నే బందీ చేసింది


నే నిన్నే వరించా.. 

వరించా.. వరించి తరించా


సుజాతా..హహహా..  

ఐ లవ్ యూ సుజాతా

నిజంగా..ఉ..ఉ..ఉమ్మ్.. 

ఐ లైక్ యూ సుజాతా

ఐ లవ్ యూ సుజాతా.. 

సుజాతా.. సుజాతా.. సుజాతా


సుజాతా..హహహా..  

ఐ లవ్ యూ సుజాతా

నిజంగా..ఉ..ఉ..ఉమ్మ్.. 

ఐ లైక్ యూ సుజాతా


- పాటల ధనుస్సు 

26, అక్టోబర్ 2022, బుధవారం

ఏదో ఏదో ఎంతో చెప్పాలని | Edo Edo Entho Cheppalani | Song Lyrics | Surya Chandrulu (1978)

ఏదో ఏదో ఎంతో చెప్పాలని



చిత్రం :  సూర్యచంద్రులు (1978)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత  :  సినారె

నేపథ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ



పల్లవి :


ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..

మనసంతా విప్పాలని..

అంతే..అంతే.. అంతే..!


ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..

మనసంతా విప్పాలని..

అంతే..అంతే.. అంతే..!



చరణం 1 :


చూసీ.. బాణాలు దూసీ.. ప్రాణాలు తీసీ..

ముసి ముసి నవ్వు విసిరేయకూ..

ఊగీ.. మబ్బల్లే.. మూగీ.. మెరుపల్లే.. సాగీ

నా గుండెల్లో ముసురేయకు..


చూసీ.. బాణాలు దూసీ.. ప్రాణాలు తీసీ..

ముసి ముసి నవ్వు విసిరేయకూ

ఊగీ.. మబ్బల్లే.. మూగీ.. మెరుపల్లే.. సాగీ

నా గుండెల్లో ముసురేయకు..


హోలోలే.. హోలోలే.. హోలోలోహోలోలే..

అంతే..అంతే..అంతే! 


ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..

మనసంతా విప్పాలని..

అంతే..అంతే.. అంతే..!



చరణం 2 :



కోరీ.. ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ

నా మనసింక ఊరించకు..

వలచి.. ఈ వేళ పిలిచి... దూరాన నిలిచి

నను మరికాస్త ఉడికించకు..


కోరీ..ఊహల్లో దూరీ.. కళ్ళల్లో చేరీ

నా మనసింక ఊరించకు..

వలచి.. ఈ వేళ పిలిచి... దూరాన నిలిచి

నను మరికాస్త ఉడికించకు..


హోలోలే..హోలోలే..హోలోలోహోలోలే..

అంతే..అంతే..అంతే..


ఏదో..ఏదో..ఎంతో..చెప్పాలని..

మనసంతా విప్పాలని..

అంతే..అంతే.. అంతే..!


పాటల ధనుస్సు 

24, మే 2022, మంగళవారం

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు | Sinnari Navvu | Song Lyrics | Krishnavatharam (1982)

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు



చిత్రం: కృష్ణావతారం (1982)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ

నేపధ్య గానం: బాలు, శైలజ 


పల్లవి:


సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు

సెరువంత చీకటిని సుక్కంత వెలుగు

సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల

సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల...


చరణం 1:


పువ్వులో పువ్వుంది బంగారు తల్లి

పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి

మనసున్న మడిసొకడు ఈడనున్నాడు

ఈడు రాకుండాను తోడుండగలడు


సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు


చరణం 2:


ఓ కంట కన్నీరు ఉరికేను చూడు

ఓ కంట పన్నీరు కురిసేను నేడు

కన్నతల్లి మనసు మురిపాలవెల్లి

కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...

ఒంటిపైన లేని మనసంతవోయి

ఒడిలోని పాపాయి వటపత్ర శాయి


చరణం 3:


హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి

హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ


హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి


అత్తరూ లేదురా పన్నీరు లేదు

ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు

సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ

నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు

కన్నతల్లికి కంటి పాపవే గాని

కడవాళ్లకే కంటి నలుసు వయ్యావు

నేలపై పారాడు బాల కిట్టమ్మా

నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా

నేలాపై పారాడు బాలా కిట్టమ్మా

నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు