RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rajendra prasad songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rajendra prasad songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2026, ఆదివారం

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో | Ichuko Muddichi Puchuko | Song Lyrics | Mutyamantha Muddu (1989)

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో


చిత్రం : ముత్యమంత ముద్దు (1989)

సంగీతం : హంసలేఖ

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి:


ఇచ్చుకో .. ముద్దిచ్చి పుచ్చుకో

ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. 

ముద్దబంతి లాగ విచ్చుకో

ఇచ్చుకో.. ముద్దిచ్చి పుచ్చుకో

ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. 

ముద్దబంతి పూలు దోచుకో

సంగతేమిటో .. దొంగలించుకో .. 

బెంగ ఎందుకో..


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..

ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..

ముద్దబంతి లాగ విచ్చుకో...


చరణం 1:


నీ కన్నూ గీటినప్పుడే 

సిరివెన్నెలాయే

నీ గాలీ సోకినప్పుడే 

సన్నజాజీ పూసే .. 

విరబూసే


చిరుముద్దూ పెట్టినప్పుడే 

సిరిమువ్వా మోగే

నీ చేయీ తాకినప్పుడే 

జడకొంగూ జారే ..

చలితీరేచిలిపి వలపు చిలక 

పలికితేకలికి చిలక అలక తీరదా

పెదవి పెదవి అదిమినంతనే

మరుల మధువు పొరలి 


పొంగనీ నాలో...

వసంతమే ఊరేగీ 

వచ్చేటీ వయసులలో


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..

ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..

ముద్దబంతి లాగ విచ్చుకో


చరణం 2:


నీ లేఖా అందినప్పుడే 

మొదలాయే మోహం

నీ రేఖా దాటినప్పుడే 

శృతిమించే దాహం .. 

నీ స్నేహం


నీ జంటా చేరినప్పుడే 

బ్రతుకాయే బంధం

నీ ఒళ్ళో వాలినప్పుడే 

దొరికిందీ స్వర్గం .. నీ సర్వం


కనులు కలిసి కలలు మరిగితి

వెలుగు తగిలి వలపు పండగా

తనువు తనువు అదుపు తప్పితే

మనసులడుగు మనువు

జరిగెనే నాలో...

సరాగమే సంగీత గంధాలూ 

చిలకగనే..


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..

ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..

ముద్దబంతి లాగ విచ్చుకో..


- పాటల ధనుస్సు 


ఓ అందమా తెలుగింటి దీపమా | O Andama Teliginti | Song Lyrics | Mutyamantha Muddu (1989)

ఓ అందమా తెలుగింటి దీపమా 


చిత్రం  : ముత్యమంత ముద్దు (1989)

సంగీతం  : హంసలేఖ

గీతరచయిత  : వేటూరి

నేపధ్య గానం  : ఎస్ పి బాలు,


పల్లవి:


ఓ... ఓ అందమా...

తెలుగింటి దీపమా వెలుగంటి 

రూపమా నేనంటే కోపమా

ఓ...ఓ అందమా...

తెలుగింటీ దీపమా 

వెలుగంటి రూపమా 

నేనంటే కోపమా

నీ అందమే నాకు ఆలాపనా

I Love You.. I Love You.. 

I Love You...


చరణం 1:


చిరునవ్వే చేమంతిగా 

విరిజల్లే హేమంతమా

మునుపెరుగని ఏ బంధాలో 

ముడుపులు ఇచ్చావూ

బాలా... శృంగారమాలా..

అరవిచ్చే అందాలతో 

మనసిచ్చే మందారమా

కలలను పరచి హృదయాన్నే 

కలవర పరిచావూ

భామా... రాసాడే బ్రహ్మా... 

నీ కోసమే తీపి ఆవేదనా

I Love You.. I Love You.. 

I Love You...


ఓ... ఓ అందమా...

తెలుగింటి దీపమా 

వెలుగంటి రూపమా నేనంటే కోపమా


చరణం 2:


హరివిల్లూ అందాలతో 

ఎదురొచ్చే ఆకాశమా

తొలకరి జల్లై గుండెల్లో 

అలజడి పెంచావూ

ప్రేమే... నాకున్న ధీమా...

రవివర్మా చిత్రానివో 

నవ హంపీ శిల్పానివో

మదనుడు వేసే బాణంలా 

మనసును గిచ్చావూ

గుమ్మా... ఓ బాపూ బొమ్మా... 

ఈ గీతమే నీకు ఆరాధనా

I Love You.. I Love You.. 

I Love You...


ఓ... ఓ అందమా...

తెలుగింటి దీపమా 

వెలుగంటి రూపమా 

నేనంటే కోపమా

I Love You.. I Love You.. 

I Love You...

I.. Love.. You..


- పాటల ధనుస్సు 


ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ | Premalekha Rasa | Song Lyrics | Mutyamantha Muddu (1989)

ప్రేమలేఖ రాశా నీకంది ఉంటదీ 


చిత్రం :  ముత్యమంత ముద్దు (1989)

సంగీతం :  హంసలేఖ

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి

 

పల్లవి:


ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ

పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ

నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ

పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ

మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ

మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ

వస్తే ..గిస్తే ..వలచీ .. 

వందనాలు చేసుకుంట..


హంసలేఖ పంపా.. నీకంది ఉంటదీ

పూలపక్క వేశా.. అది వేచి ఉంటదీ


చరణం 1:


ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా .. 

అందమైన పొడుపు కథలు విప్పనా

కోడెగాడి మనసు తీరు చెప్పనా .. 

కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా

సత్యభామ అలకలన్ని పలకరింతలే .. 

అన్నాడు ముక్కుతిమ్మనా

మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో .. 

అన్నాడు భక్త పోతనా


వలచి వస్తినే వసంతమాడవే .. 

సరసమాడినా క్షమించలేనురా

వలచి వస్తినే వసంతమాడవే .. 

సరసమాడినా క్షమించలేనురా

కృష్ణా ..గోదారుల్లో .. 

ఏది బెస్టొ చెప్పమంట ... !

హంస లేఖ పంపా నీకంది ఉంటదీ

పూల బాణమేశా ఎదకంది ఉంటదీ


చరణం 2:


మాఘమాస వెన్నెలెంత వెచ్చనా .. 

మంచి వాడివైతె నిన్ను మెచ్చనా

పంటకెదుగుతున్న పైరు పచ్చనా .. 

పైట కొంగు జారకుండ నిలుచునా

సినీమాల కథలు వింటె చిత్తు కానులే .. 

చాలించు నీ కథాకళీ

ఆడవారి మాటకు అర్థాలే వేరులే .. 

అన్నాడు గ్రేటు పింగళీ


అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 

ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే

అష్ట పదులతో అలాగ కొట్టకూ .. 

ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే


నుయ్యొ.. గొయ్యొ .. 

ఏదో అడ్డదారి చూసుకుంట ...

ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ

పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..

 

- పాటల ధనుస్సు 


7, ఫిబ్రవరి 2024, బుధవారం

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి | Aa Roju Naa Rani Chirunavvu chusi | Song Lyrics | Brindavanam (1992)

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి 



చిత్రం : బృందావనం (1992)

సంగీతం : మాదవపెద్ది సురేశ్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు , జానకి 



పల్లవి :


ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 1 :


ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది... 

ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది

ఆ రోజు ఓ చూపు వలలే వేసింది... 

ఈ రోజు మాపుల్లో కలలే తోచింది

కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే

ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే 

ఈ రోజే నాకు తెలిసింది... 

ఈ చిత్రాలు చేసింది లవ్వని

మధు పత్రాలు రాసింది లవ్వని... 



ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని 


చరణం 2 :


ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ... 

ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా

ఆ రోజు మెరిసింది అందం చిరునామా... 

ఈ రోజు కలిసింది జతగా ఈ భామ

గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే

ఆశలే వెల్లువాయే....  ఊసులే చల్లిపోయే

ఈ రోజే నాకు తెలిసింది... 

రాగాలు రేపింది లవ్వని

అనురాగాలు చూపింది నువ్వని... 


ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని

ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి... 

అనుకున్నా ఏదో నవ్వని

ఈ రోజే నాకు తెలిసింది... 

ఆ నవ్వున దాగుంది లవ్వని

ఎద జివ్వున లాగింది లవ్వని


పాటల ధనుస్సు  

26, నవంబర్ 2023, ఆదివారం

అందరి బంధువయ్య | Andari Bandhuvayya | Song Lyrics | Devullu (2000)

అందరి బంధువయ్య



చిత్రం: దేవుళ్ళు (2000) 

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ 

గీతరచయిత: జొన్నవొత్తుల 

నేపధ్య గానం: బాలు 



పల్లవి: 


రామా... ఆ.. ఆ.. 

అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

కొర్కెలు తీర్చే వాడయ్య.. 

కొదండ రామయ్య 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

రామా... ఆ... రామా... ఆ... ఆ... 



చరణం 1: 


తెల్లవారితే చక్రవర్తై 

రాజ్యమునేలె రామయ్య 

తండ్రిమాటకై పదవిని వదలి 

అడవులుకేగెనయా 

మహిలో జనులను కావగవచ్చిన 

మహవిష్ణు అవతరమయ 

ఆలిని రక్కసుడు అపహరించితె 

ఆక్రోశించెనయ 

అసురను ద్రుంచి అమ్మను తెచ్చి 

అగ్నిపరిక్ష విధించెనయ 

చాకలి నిందకు సత్యము చాటగ 

కులసతినేవిడనాడనయ 

నా రాముని కష్టం లోకంలో 

ఎవరూ పడలేరయ్యా 

ఆ... ఆ... 


నా రాముని కష్టం లోకంలో 

ఎవరూ పడలేరయ్యా 

సత్యం ధర్మం త్యాగంలో 

అతనుకి సరిలేరయ్య 

కరుణ హృదయుడు.. 

శరణనువాడికి 

అభయమొసుగునయ్యా 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 


చరణం 2: 


భద్రాచలము పుణ్యక్షేత్రము.. 

అంతా రామ మయం 

భక్తుడు భద్రుని కొండగ మార్చి.. 

కొలువై వున్న స్థలం 

పరమ భక్తితో రామదాసు 

ఈ అలయమును కట్టించెనయ 

సీతారామ లక్ష్మణులకు 

ఆభరణములే చేయించెనయ 

పంచవటిని ఆ జనకిరాముల 

పర్ణశాల అదిగో 

సీతారాములు జలకములాడిన 

శేషతీర్ధమదిగో 

రామభక్తితో నదిగా మారిన 

శబరి ఇదేనయ్య 

ఆ... ఆ... ఆ... 

రామభక్తితో నదిగా మారిన 

శబరి ఇదేనయ్య 

శ్రీరామ పాదము నిత్యం 

కడిగే గోదారయ్య 

ఈ క్షేత్రం తీర్దం దర్శించిన... 

జన్మధన్యమయ్య... 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య 

చెయుతనిచ్చె వాడయ్య.. 

మా సీతా రామయ్య 

కొర్కెలు తీర్చే వాడయ్య.. 

కొదండ రామయ్య 


అందరి బంధువయ్య.. 

భద్రాచల రామయ్య 

ఆదుకునే ప్రభువయ్య.. 

ఆ అయొధ్య రామయ్య


పాటల ధనుస్సు 


23, నవంబర్ 2022, బుధవారం

సరికొత్త చీర ఊహించినాను | Sarikotta cheera vuhinchinanu | Song Lyrics | Pelli Pustakam (1991)

సరికొత్త చీర ఊహించినాను



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు


పల్లవి :


సరికొత్త చీర ఊహించినాను

సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగూ పేక

చీరలో చిత్రించినాను

ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


చరణం 1:


ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు

ముళ్ళు వాసన ఒక అందం

అభిమానం గల ఆడపిల్లకు

అలక కులుకు ఒక అందం

ఈ అందాలన్నీ కలబోశా

నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఈ అందాలన్నీ కలబోశా

నీ కొంగుకు చెంగున ముడి వేస్తా


ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


చరణం 2:


చుర చుర చూపులు ఒక మారు

నీ చిరు చిరు నవ్వులు ఒక మారు

మూతి విరుపులు ఒక మారు

నువు ముద్దుకు సిద్దం ఒక మారు

నువు ఏ కలనున్నా మా బాగే

ఈ చీర విశేషం అల్లాగే

నువు ఏ కలనున్నా మా బాగే

ఈ చీర విశేషం అల్లాగే


సరికొత్త చీర ఊహించినాను

సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగూ పేక 

చీరలో చిత్రించినాను

ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


పాటల ధనుస్సు  


22, నవంబర్ 2022, మంగళవారం

కృష్ణం కలయ సఖి సుందరం | Krishnam Kalayasakhi Sundaram | Song Lyrics | Pelli Pustakam (1991)

కృష్ణం కలయ సఖి సుందరం



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. శైలజ, రాజేశ్వరి


కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కథవిశయ తృష్ణం

కృష్ణం కథవిశయ తృష్ణం

జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా

బాల కృష్ణం కలయ సఖి సుందరం


శృంగార రసభర సంగీత సాహిత్య

శృంగార రసభర సంగీత సాహిత్య

గంగాల హరికేల సంగం సదా

బాల కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం


రాధారుణాధర సుతాపం సచ్చిదానంద

రాధారుణాధర సుతాపం సచ్చిదానంద

రూపం జగత్రయ భూపం సదా

బాల కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం


అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ

అర్థం శీథిలీకృతానర్తనం శ్రీ నారాయణ

తీర్థం పురుషార్థం సదా

బాల కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం


పాటల ధనుస్సు  


హాయి హాయి శ్రీరంగ సాయి | Hayi Hayi Sriranga Sayi | Song Lyrics | Pelli Pustakam (1991)

హాయి హాయి శ్రీరంగ సాయి



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. శైలజ, పి. సుశీల


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల (2)

కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


అజ్ఞాత వాసాన అతివ పాంచాలి

ఆరళ్ళు భీమన్న దూరమ్ము సేయు

ఆవేశ పడరాదు అలసి పోరాదు

అభిమానమే చాలు అనుచుకోన మేలు


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే

భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు

నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే

భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు

మాగన్నులొనైన మరచిపో కక్ష

సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా


పాటల ధనుస్సు  


13, నవంబర్ 2022, ఆదివారం

శ్రీరస్తూ శుభమస్తూ | Srirastu Shubamastu | Song Lyrics | Pelli Pustakam (1991)

 శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ 



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు, సుశీల



శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ


తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో

తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో

తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

మసకేయని పున్నమిలా మణికి నింపుకో


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ


పాటల ధనుస్సు  


12, నవంబర్ 2022, శనివారం

అమ్ము కుట్టి అమ్ము కుట్టి | Ammu kutti Ammu kutti | Song Lyrics | Pelli Pustakam (1991)

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో 



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు, సుశీల


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


ఓ అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు

హా చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు

ఎందా…?

చెంపకు కన్నులు చారెడు

సన్నని నడుము పిడికెడు

దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన

నల్లని నీ జడ బారెడు

మనసిలాయో…


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి

అదేవిటి

ఓ గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు

మ్మ్ గుటకలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి

ఆ కులుకు చూస్తే గుటకలు

సరసకు రమ్మని చిటికెలు

చక్కని చిన్నది అందం చందం

చేజిక్కాలని కిటుకులు

మనసిలాయో…


కిట్ట మూర్తి కిట్ట మూర్తి మనసిలాయో

మనసిలాయో మనసిలాయో అమ్ము కుట్టి


గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు

పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు

చుట్టూ చూస్తే అందాలు

లొట్టలు వేస్తూ మా వారు

చుట్టూ చూస్తే అందాలు

లొట్టలు వేస్తూ మా వారు

అక్కడ తమకు ఇక్కడ మనకు

విరహంలోన వెక్కిళ్ళు

మనసిలాయో హొ హొ


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

అమ్ము కుట్టి అమ్ము కుట అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


పాటల ధనుస్సు  


27, మార్చి 2022, ఆదివారం

ప్రేమతో చిలక మడుపు సేవలా | Prematho Chilaka Madupu | Song Lyrics | Bamma Mata Bangaru Bata (1990)

ప్రేమతో చిలక మడుపు సేవలా



Lyrics - Veturi, 

Movie - Baamma Maata Bangaaru Baata, (1990)

Singer - Janaki, 

Singer - SP Balasubrahmanyam

Music : SP Balu



ప్రేమతో చిలక మడుపు సేవలా

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

మొగ్గ విచ్చుకున్నవేళ కలువ భామ

ముద్దుల్లని లెక్కపెట్టే చందమామ

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


గుట్టులేని గుండేలో గుచ్చి గుచ్చి చూడకు

మల్లెపూల దండలో ధారమిక దాచకు

కొంటెగా చూడకు కోతి సిగ్గు మాత్రము

కంటితో తుంచని కన్నెజాజి పుష్పము

రేగుతున్న యెవ్వన్నం వేగుచుక్క కోరిన

కాగుతున్న పాలలో మీగడిక దాగున

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా

మొగ్గ విచ్చుకున్నవేళ కలువ భామ

ముద్దుల్లని లెక్కపెట్టే చందమామ

ప్రేమతో చిలక మడుపు సేవలా

సిగ్గుతో చిలిపి వలపు పూజలా


పాటల ధనుస్సు


6, మార్చి 2022, ఆదివారం

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా | Oho Oho Bulli Pavurama | Song Lyrics | Brindavanam (1992)

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా



చిత్రం : బృందావనం (1992)

సంగీతం : మాదవపెద్ది సురేశ్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు , జానకి 


పల్లవి :


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా

అయ్యో పాపం అంటే అది నేరమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...

అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా

పదే పదే అదే వెటకారమా

అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...

శృతి ఇక మించనీకుమా


చరణం 1 :


మాటే వినకుంటే బయటే పడుకుంటే

మంచే పడునంట మంచే చెబుతుంట 


అమ్మో మగవారు అన్నిట తగువారు

హద్దే మరిచేరు చాలిక ఆ జోరు 


కోపం తీరాలంట తాపం తగ్గాలంట

తాపం తగ్గాలంటే చొరవే మానాలంట

మాటా మంతీ మర్యాదే అపచారమా



ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... 

పదే పదే అదే వెటకారమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ... 

అలకలు వారి సొంతమా 


చరణం 2 :


నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట

వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట 


గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట

అల్లరి చాలిస్తే ఎంతో మేలంట 


వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట

కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట

తగని తెగని తగువంతా తన నైజమా


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... 

అయ్యో పాపం అంటే అది నేరమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ....  

అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... 

పదే పదే అదే వెటకారమా

అతివలు అంత సులభమా ఓ ఓ ఓ... 

శృతి ఇక మించనీకుమా

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... 

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు