RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, మార్చి 2022, ఆదివారం

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా | Oho Oho Bulli Pavurama | Song Lyrics | Brindavanam (1992)

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా



చిత్రం : బృందావనం (1992)

సంగీతం : మాదవపెద్ది సురేశ్

గీతరచయిత : వెన్నెలకంటి

నేపధ్య గానం : బాలు , జానకి 


పల్లవి :


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా

అయ్యో పాపం అంటే అది నేరమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...

అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా

పదే పదే అదే వెటకారమా

అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...

శృతి ఇక మించనీకుమా


చరణం 1 :


మాటే వినకుంటే బయటే పడుకుంటే

మంచే పడునంట మంచే చెబుతుంట 


అమ్మో మగవారు అన్నిట తగువారు

హద్దే మరిచేరు చాలిక ఆ జోరు 


కోపం తీరాలంట తాపం తగ్గాలంట

తాపం తగ్గాలంటే చొరవే మానాలంట

మాటా మంతీ మర్యాదే అపచారమా



ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... 

పదే పదే అదే వెటకారమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ... 

అలకలు వారి సొంతమా 


చరణం 2 :


నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట

వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట 


గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట

అల్లరి చాలిస్తే ఎంతో మేలంట 


వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట

కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట

తగని తెగని తగువంతా తన నైజమా


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... 

అయ్యో పాపం అంటే అది నేరమా

అతివలకింత పంతమా ఓ ఓ ఓ....  

అలకలు వారి సొంతమా 


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా... 

పదే పదే అదే వెటకారమా

అతివలు అంత సులభమా ఓ ఓ ఓ... 

శృతి ఇక మించనీకుమా

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా.... 

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు