కట్టింది ఎర్రకోక పొయ్యేది ఏడదాక
చిత్రం : అందరూ మంచివారే (1975)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కట్టింది ఎర్రకోక... పొయ్యేది ఏడదాక
కట్టింది ఎర్రకోక... పొయ్యేది ఏడదాక
పలకమన్న పలకదే పంచవన్నెల చిలక
అరే... పలకమన్న పలకదే పంచవన్నెల చిలక
కట్టింది ఎర్రకోక... పొయ్యేది మంచె దాక
కట్టింది ఎర్రకోక... పొయ్యేది మంచె దాక
పలుకుగిలుకులెందుకోయ్...
మనసు తెలుసుకొనక
పలుకుగిలుకులెందుకోయ్...
మనసు తెలుసుకొనక
చరణం 1 :
పచ్చాపచ్చని చేలు చూస్తుంటే...
ఒనలచ్చిమిలా నువ్వు అడుగు వేస్తుంటే
పచ్చాపచ్చని చేలు చూస్తుంటే...
ఒనలచ్చిమిలా నువ్వు అడుగు వేస్తుంటే
కదిలే నా గుండె ఆగుతుంది...
కదిలే నా గుండె ఆగుతుంది
నువ్వాగితే ఆ గుండె కదులుతుంది...
కట్టింది ఎర్రకోక... పొయ్యేది ఏడదాక
పలకమన్న పలకదే పంచవన్నెల చిలక
అరే... పలకమన్న పలకదే పంచవన్నెల చిలక
చరణం 2 :
సాకులతో నువ్వుచేరువొస్తూ ఉంటే...
నీ చూపులతో నన్ను నమిలి వేస్తూ ఉంటే...
సాకులతో నువ్వుచేరువొస్తూ ఉంటే...
నీ చూపులతో నన్ను నమిలి వేస్తూ ఉంటే...
తీయని మగతేదో కమ్ముతుంది...
సన్నాయిలా నా మనసే లాగుతుంది
కట్టింది ఎర్రకోక... పొయ్యేది మంచె దాక
పలుకుగిలుకులెందుకోయ్...
మనసు తెలుసుకొనక
పలుకుగిలుకులెందుకోయ్...
మనసు తెలుసుకొనక
హే..హే..హే..హే... ఓ...ఓ... ఓ.. ఓ..
హే..హే..హే..హే... ఓ...ఓ... ఓ.. ఓ..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి