RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, మార్చి 2022, మంగళవారం

రామచిలుక తెలుపవే | Ramachiluka telupave | Song Lyrics | Pratijna Palana (1965)

రామచిలుక తెలుపవే


చిత్రం : ప్రతిజ్ఞ పాలన (1965)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో... ఓ..ఓ..
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... 
ప్రేమ ఏమిటో...

చరణం : 1

కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
ఓ ఓ ఓ....
కలలో ఒక అందగాడు కన్ను కలిపి నవ్వెనే
కనుకలుపగ నా వన్నెలు కడలిపొంగులాయెనే
కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆ..ఆ..ఆ.... ఓ..ఓ....

కన్నెమనసు పొంగించిన వెన్నెల రాజెవ్వరే
ఆనరా...తనెవ్వరా...వరించు నాధుడే..హ..హ..హ..

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... 
ప్రేమ ఏమిటో...

చరణం : 2

అహహా ఒహొహో...
ఓ....

ఒక చోటను నిలువలేను ఒంటరిగా ఉండలేను
ఊహలోని చెలికానితో ఊసులాడి వేగలేను
జాబిలితో ఈ తారక జతగూడుట ఎన్నడే...

కానరా..నీ నోమునూ...ఫలించినప్పుడే...అహహా 

రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో
అనురాగమో సరాగమో అదేమి లోకమో...
రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో... 
ప్రేమ ఏమిటో...

- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు