ముత్యాల కోనలోన
చిత్రం: డూ..డూ.. బసవన్న (1978)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ముత్యాల కోనలోన... రతనాల రామసిలకా...
ముత్యాల కోనలోన... రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా...
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా...
ముత్యాల కోనలోన... రతనాల రామసిలకా...
ముత్యాల కోనలోన... రతనాల రామసిలకా
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా...
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా...
చరణం 1:
సెమ్మచెక్కలాడమంటే ఓరబ్బో...
అమ్మబాబో అన్నావు ఇన్నాళ్ళు...
పెళ్లి ఊసంటే ఓరబ్బో...
కళ్ళు తేలేసినావు ఇన్నాళ్ళు...
సెమ్మచెక్కలాడమంటే ఓరబ్బో...
అమ్మబాబో అన్నావు ఇన్నాళ్ళు...
పెళ్లి ఊసంటే ఓరబ్బో...
కళ్ళు తేలేసినావు ఇన్నాళ్ళు...
నిన్నటి బసవడు కాడే...ఏ...ఏ....
నిన్నటి బసవడు కాడే...
ఇక ముందుందే నా తడాకా...
ముత్యాల కోనలోన... రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా...
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా...
చరణం 2:
కొండగాలి కొడతాంది మల్లమ్మో...
ఉండలేకున్నాను ఓలమ్మో...
అహ కొండగాలి..అబ్బా...
కొండగాలి...అయ్యో..
కొండగాలి కొడతాంది మల్లమ్మో...
ఉండలేకున్నాను ఓలమ్మో...
ఎక్కువేమి అడగలేదు మల్లమ్మో...
ఒక్క ముద్దు పెట్టి చూడు మల్లమ్మో..
అహ..ఒక్క ముద్దు...అయ్యో...ఒక్క ముద్దు...అబ్బ...
ఒక్క ముద్దు పెట్టి చూడు ఓలమ్మో...
ముంగిట సన్నాయి మ్రోగందే....ఏ....
ముంగిట సన్నాయి మ్రోగందే...
అహ..ముద్దిమంటే మజాకా...
ముత్యాల కోనలోన...
రతనాల రామసిలకా
ఏవమ్మో ఈ సిగ్గు ఎందాక ఎందాకా...
ఓరయ్యో ఈ సిగ్గు ఊరేగునందాకా....
ఎందాకా....ఊరేగునందాకా....
ఎందాకా....ఊరేగునందాకా....
ఎందాకా....ఊరేగునందాకా....
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి