నీ వలపే బృందావనం
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
నేపథ్య గానం : బాలు, సుశీల
గీత రచన : దాశరధి
పల్లవి :
రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...
నీ వలపే బృందావనం....
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో... తేలి ఆడాలిలే
నీ వలపే బృందావనం...
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో... తేలి ఊగాలిలే
చరణం 1:
కొంటె కృష్ణుని కులుకు చూపులో...
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో...
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడకలో ఈ వేళా...
నవ వధువు తడబాటు కనిపించెలే
రంగైన వజ్రాల పందిరిలో...
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే ..
రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...
చరణం 2:
రాధా కృష్ణుల అనురాగాలు...
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు...
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే..
రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...
నీ వలపే బృందావనం....
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో... తేలి ఆడాలిలే
రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...
రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి