మధుర మురళి హృదయ రవళి
చిత్రం : ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి...
పొంగె యద పొంగె
ఈ బృందా విహారాలలోనా..
నా అందాలు నీవే రా కన్నా
ఈ బృందా విహారాలలోనా...
నా అందాలు నీవే రా కన్నా
మధుర మురళి హృదయ రవళి
యదలు కలుపు ప్రణయ కడలి...
సాగే సుడి రేగే
ఈ బృందా విహారాలలోనా...
ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందా విహారాలలోనా...
ఎవరున్నారు రాధమ్మ కన్నా
చరణం 1 :
గోధూళి వేళల్లో.. గోపెమ్మ కౌగిట్లో
లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో
పున్నాగ తోటల్లో.. సన్నాయి పందిట్లో
నాజూకులన్నీ నాకు దక్కేవేళల్లో
పగలో అవతారం.. రాత్రో శృంగారం
ఎదలో తారంగం శ్రీవారికీ
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే
రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ గీతము...
ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధుర మురళి హృదయ రవళి
యదలు పలకు ప్రణయ కడలి...
సాగే సుడి రేగే
ఈ బృందావిహారాలలోనా...
నా అందాలు నీవే రా కన్నా
ఈ బృందావిహారాలలోనా...
ఎవరున్నారు రాధమ్మ కన్నా
చరణం 2 :
హేమంత వేళల్లో... లే మంచు పందిట్లో
నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో... ఏకాంత సీమల్లో
ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం ... మనసే మకరందం
సిగ్గే సిందూరం శ్రీదేవికీ
అందాలెన్నైనా అందేదొకటేలే
ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే
ఓ అందాల అనుబంధం
మధుర మురళి హృదయ రవళి
అధర సుధల యమున పొరలి...
పొంగె యద పొంగె
ఈ బృందావిహారాలలోనా...
ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోనా...
నా అందాలు నీవే రా కన్నా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి