RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sridevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sridevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2026, బుధవారం

కొండమీన సందమామా | Kondameena Sandamama | Song Lyrics | Vetagadu (1979)

కొండమీన సందమామా


చిత్రం :  వేటగాడు (1979)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ..

కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..

కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..

కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ..


కొండమీన సందమామా.. 

కొనలోన కోయభామ..

కొండమీన సందమామా.. 

కొనలోన కోయభామ..


పకపకలాడింది ..

నా పట్టు తప్పింది

పకపకలాడింది ..

నా పట్టు తప్పింది

దీని ముక్కుకు తాడెయ్యా..

బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కులు..మొక్కయ్యా..

ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా... 

కొనలోన కోయ మామ..

కొండమీన సందమామా... 

కొనలోన కోయ మామ..


తొంగి చూశాడూ..

నా కొంగు లాగాడు..

తొంగి చూశాడూ..

నా కొంగు లాగాడు..

ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..

బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కలు పక్కేయ్యా..

ఈ పక్కిట సిక్కే నా సొంతం.. 


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయ మామ..ఆ..ఆ


చరణం 1 :


ఎండల్లో వానలాగే 

యెంట వస్తాను..

కొండల్లో కోన లాగే 

జంటగుంటాను..

ఆ మూడు ముల్లేసి.. 

ఈ ముద్దు చెల్లిస్తా..

ఆ మూడు ముల్లేసి.. 

ఈ ముద్దు చెల్లిస్తా..


ఐదు ప్రాణాల అందం... 

ఆరతీస్తాను..

ఏడూ జన్మాల బంధం... 

హారమేస్తానూ..

ఐదు ప్రాణాల అందం... 

ఆరతీస్తాను..

ఏడూ జన్మాల బంధం.. 

హారమేస్తానూ..


ఈ ముద్దు చెల్లిస్తే..

ఆ హద్దు చెరిపేస్తా..

ఈ ముద్దు చెల్లిస్తే..

ఆ హద్దు చెరిపేస్తా..


దీని ముక్కుకు తాడెయ్య..

బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కులు..మొక్కయ్యా..

ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయమామ..

కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయభామ..


చరణం 2 :


ఏరంటి నిన్ను చూసి 

ఎల్లువవుతాను..

వరదల్లె పొంగుతుంటే 

వంతెనేస్తాను

ఎన్నెట్లో గోదారి.. 

కౌగిట్లో పొంగిస్తా..

ఎన్నెట్లో గోదారి.. 

కౌగిట్లో పొంగిస్తా..


ఆకాశమయితే నువ్వు... 

చుక్కనవుతాను..

అందాల జాబిలయితే... 

పక్కనుంటాను..

ఆకాశమయితే నువ్వు... 

చుక్కనవుతాను..

అందాల జాబిలయితే ...

పక్కనుంటాను..


మల్లెల్లో ఇల్లేసీ..

మనసంతా ఇచ్చేస్తా..

మల్లెల్లో ఇల్లేసీ..

మనసంతా ఇచ్చేస్తా..


దీని ముక్కుకు తాడెయ్య..

బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కులు..మొక్కయ్యా..

ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయభామ..


పకపకలాడింది .. 

నా పట్టు తప్పింది

తొంగి చూశాడూ.. 

నా కొంగు లాగాడు..

ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..

బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కలు పక్కేయ్యా..

ఈ పక్కిట సిక్కే నా సొంతం..

కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయభామ..

కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ

కొనలోన కోయమామ..


కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..

కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..

కొయిలాలో..ఓ..ఓ


- పాటల ధనుస్సు 


6, మార్చి 2026, శుక్రవారం

బంగారు బాతు గుడ్డు | Bangaru Bathu Guddu | Song Lyrics | Vetagadu (1979)

బంగారు బాతు గుడ్డు 


చిత్రం : వేటగాడు (1979)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..

బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..


సయ్యనవే.... నా సరసకు రావే....

సయ్యనవే.... నా సరసకు రావే....

చక్కెర తునుక కిక్కురమనక.. 

పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ..

నా లడ్డు..ఊ..ఊ... గాడిద గుడ్డు..


ఆ..బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..


చరణం 1 :


తీగ నడుములో...  రాగమున్నది..

పాల సొగసులో.... మీగడున్నదీ....

వయసు వరదలా... పొంగుతున్నదీ..

మనసు మరదల అంటూ వున్నది..


తుంటరి గుంట..హ్హా..హ్హా..హ్హా 

వంటరిగుంటే..హ..

తుంటరి గుంట వంటరిగుంటే.. 

వంటికిమంచిది కాదీ పొద్దు... 

లడ్డు..నా లడ్డు..

గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ


అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..

అమ్మాయి వాటం తెలియకున్నదీ..

అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..

అమ్మాయి వాటం తెలియకున్నదీ..

చేయి తగిలినా చెంప పగిలినా 

తడిమి చూసుకొని పడతావయ్యో 

రోడ్డు.. ఓరి జిడ్డూ..

గాడిద గుడ్డు..ఉహ్హూ..!!


ఆ..బంగారు బాతు గుడ్డు.. షటాప్.

బందారు తొక్కుడు లడ్డు.. ఛా పో..


చరణం 2 :


కస్సు మన్నదీ  గడసు చిన్నదీ..

కిస్సు..కిస్సనీ అడుగుతున్నదీ..

పగటి చుక్కలా వెలుగుతున్నదీ..ఈ

పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ..


లకుముకి పిట్ట..త్ప్రూ..హూ..

తికమకపెడితే..ఆహా..

లకుముకి పిట్ట..తికమకపెడితే....

చెకుముకి దెబ్బ తినిపిస్తానే 

లడ్డు..నా లడ్డూ..

గాడిద గుడ్డు..! ముహ్హూ...


హల్లో మిస్టర్..అడవిరాముడు..!! 

హో..హో..హో..హో..

అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు..!! 

పోయీ..పోయ్ పపబ్బాయి..

హల్లో మిస్టర్ అడవిరాముడు....

అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు

తాత తుపాకి పాత గిరాకీ..

పిల్ల చలాకీ చూపిస్తాలే..

చూడు..ఓరి జిడ్డూ

గాడిద గుడ్డు..! ముహ్హూ


బంగారు బాతు గుడ్డు..!! 

షటాప్.

బందారు తొక్కుడు లడ్డు..!! 

ఛా పో..

సయ్యనవే..!! ముహ్హూ..

నా సరసకు రావే..!! 

వ్వే..వ్వే..వ్వే..

సయ్యనవే.....నా సరసకు రావే..ఏ..

చక్కెర తునుక కిక్కురమనక 

పక్కకు వస్తే చేరుస్తానే 

ఒడ్డూ..డూ..డూ..డూ

గాడిద గుడ్డు....ముహ్హూ..ఊ


- పాటల ధనుస్సు 


14, డిసెంబర్ 2025, ఆదివారం

అందాలలో అహో మహోదయం | Andalalo Aho Mahodayam | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

అందాలలో అహో మహోదయం


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


లా లా ల ల ల లా 

లా లా ల ల ల లా 

అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం 

పువ్వూ నవ్వూ పులకించే గాలిలో 

నింగీ నేలా చుంబించే లాలిలో 

తారల్లారా రారే విహారమే 


అందాలలో అహో మహోదయం 

నా చూపుకే శుభోదయం 


చరణం 1: 


లతా లతా సరాగమాడే 

సుహాసిని సుమాలతో 

వయస్సుతో వసంతమాడీ 

వరించెలే సరాలతో 

మిలా మిలా హిమాలే 

జలా జలా ముత్యాలుగా 

తళా తళా గళాన 

తటిల్లతా హారాలుగా 

చేతులు తాకిన కొండలకే 

చలనము వచ్చెనులే 

ముందుకు సాగిన ముచ్చటలో 

మువ్వలు పలికెనులే 

ఒక స్వర్గం తలవంచి 

ఇల చేరే క్షణాలలో 

అందాలలో అహో మహోదయం.. 

భూలోకమే నవోదయం 


చరణం 2: 


సరస్సులో శరత్తు కోసం 

తపస్సులే ఫలించగా 

సువర్ణిక సుగంధమేదో 

మనస్సునే హరించగా 

మరాళినై ఇలాగే మరీ 

మరీ నటించనా 

విహారినై ఇవాళే దివి 

భువి స్పృశించనా 

గ్రహములు పాడిన పల్లవికే 

జాబిలి ఊగెనులే 

కొమ్మలు తాకిన ఆమనికే 

కోయిల పుట్టెనులే 

ఒక సౌఖ్యం తనువంతా 

చెలరేగే క్షణాలలో 


అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం 

నీలాకాశం దిగివచ్చే లోయలో 

ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో 

నాలో సాగే ఏదో సరాగమే 


అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం


- పాటల ధనుస్సు 


అబ్బనీ తియ్యనీ దెబ్బ | Abbaneeteeyani Debba | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

అబ్బనీ తియ్యనీ దెబ్బ



చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అబ్బనీ తీయనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ


చరణం 1:


చిటపట నడుముల ఊపులో 

ఒక ఇరుసున వరసలు కలవగా

ముసిరిన కసికసి వయసులో 

ఒక ఎదనస పదనిస కలవుగా

కాదంటూనే కలబడు 

అది లేదంటూనే ముడిపడు

ఏమంటున్నా మదనుడు 

తెగ ప్రేమించాక వదలడు

చూస్తా సొగసు కోస్తా 

వయసు నిలబడు కౌగిట


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గా ఆఁ...


చరణం 2:


అడగక అడిగినదేవిఁటో లిపి 

చిలిపిగ ముదిరిన కవితగా

అది విని అదిమిన షోకులో 

పురి విడిచిన నెమలికి సవతిగా

నిన్నే నావి పెదవులు 

అవి నేడైనాయి మధువులు

రెండున్నాయి తనువులు 

అవి రేపవ్వాలి మనువులు

వస్తా వలచి వస్తా మనకు 

ముదిరెను ముచ్చట


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ


- పాటల ధనుస్సు 


13, డిసెంబర్ 2025, శనివారం

ధినక్కుతా కసక్కురో | Dhinakkuta Kasakkuro | Song Lyrics | Jagadeka Veerudu Atiloka Sundari (1990)

ధినక్కుతా కసక్కురో



చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా ఢమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో


చరణం 1:


కసక్కు లయలు హొయలు చూశా

కసెక్కి వలపు వలలే వేశా

గుబుక్కు ఎదలో కథలే దాచా

గుటుక్కు మనక గుబులే దోచా

మజా చేస్తే మరోటంట 

మరోటిస్తే మగాణ్ణంట

సరే అంటే అతుక్కుంటా 

సరాగంలో ఇరుక్కుంటా

చుంబురుణ్ణై.. నారదుణ్ణై..

చుంబ మీద పంబ రేపి 

పాడుతుంటే మీరు గోవిందే

గోవిందా గోవింద 

come on.. come on పాడండయ్యా

పబం పప్పా పబం పప్పా 

పబం పప్పా పబం పప్పా

పబం పం పాబం పపం పం పాబం 

పబం పం పాబా పాబా బాబాబం


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో


చరణం 2:


వయస్సు ఒడిలో చొడినే చూశా

వరించి సుడిలో పడవే వేశా

నటించే నరుడా ఘనుడా మెచ్చా

నమస్తే నడుమే నటిగా ఇచ్చా

ఉడాయిస్తే ఉడుక్కుంటా 

లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా

సఖి అంటే సరే అంటా 

చెలి అంటే గురు అంటా

బ్రేకు డ్యాన్సు.. షేకు డ్యాన్సు..

mix చేసి steps వేసి tricks చేస్తే 

మీరు గోవింద

come on..come on dance I say 

ఆడండ్రా

ధినక్కుతా ధినక్కుతా 

ధినక్కుతా ధినక్కుతా

ధినక్కు తార ధినక్కు తార 

ధినక్కు తారా తారా తారారా


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురోయ్


- పాటల ధనుస్సు 


ప్రియతమా నను పలకరించు ప్రణయమా | Priyathama | Song Lyrics | Jagadeka Veerudu Atiloka Sundari (1990)

ప్రియతమా నను పలకరించు ప్రణయమా



చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


ప్రియతమా నను పలకరించు 

ప్రణయమా..

అతిథిలా నను చేరుకున్న 

హృదయమా

బ్రతుకులోని బంధమా 

పలుకలేని భావమా

మరువలేని స్నేహమా 

మరలిరాని నేస్తమా

ప్రియతమా.. ప్రియతమా.. 

ప్రియతమా..


ప్రియతమా నను పలకరించు 

ప్రణయమా..

అతిథిలా నను చేరుకున్న 

హృదయమా

ఎదుటవున్న స్వర్గమా 

చెదిరిపోని స్వప్నమా

కనులలోని కావ్యమా 

కౌగిలింత ప్రాణమా

ప్రియతమా.. ప్రియతమా.. 

ప్రియతమా..


చరణం 1:


నింగి వీణకేమో నేల పాటలొచ్చె

తెలుగు జిలుగు అన్నీ కలిసి

పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ

వలపె తెలిపే నాలో విరిసి


మచ్చలెన్నో ఉన్న 

చందమామకన్నా 

నరుడే .. వరుడై నాలో మెరిసే

తారలమ్మకన్నా చీరకట్టుకున్న 

పడుచుతనము నాలో మురిసే


మబ్బులనీ వీడిపోయి కలిసే 

నయనం తెలిసే హృదయం


తారలన్నీ దాటగానే తగిలే గగనం.. 

రగిలే విరహం

రాయలేని భాషలో 

ఎన్ని ప్రేమలేఖలో

రాయిలాంటి గొంతులో 

ఎన్ని మూగపాటలో

అడుగే పడక గడువే గడిచి పిలిచే


చరణం 2:


ప్రాణవాయువులో వేణువూదిపోయే 

శృతిలో జతిలో నిన్నే కలిపి

దేవగానమంత ఎంకి పాటలాయే 

మనసు మమత అన్నీ కలిసి


వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే 

బహుశా మనసా వాచా వలచి

మేనకల్లే వచ్చి జానకల్లే మారె 

కులము గుణము అన్నీ కుదిరి


నీవులేని నింగిలోన వెలిగే 

ఉదయం విధికే విలయం

నీవులేని నేలమీద బ్రతుకే 

ప్రళయం మనసే మరణం

వానవిల్లు గుండెలో 

నీటికెన్ని రంగులో

అమృతాల విందులో 

ఎందుకిన్ని హద్దులో

జగమే అణువై యుగమే 

క్షణమై మిగిలే


- పాటల ధనుస్సు 


26, నవంబర్ 2022, శనివారం

చల్లగాలి చెప్పేది | Challagali Cheppedi | Song Lyrics | Devatha (1982)

చల్లగాలి చెప్పేది



చిత్రం: దేవత (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి :


చల్లగాలి చెప్పేది..ఏమని?

చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ


చల్లగాలి చెప్పేది..ఏమని?

చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ


పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?

పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని


మళ్ళి మళ్ళి..రమ్మని

చల్లగాలి చెప్పేది..ఏమని?



చరణం 1 : 


Ring-a-ring-a roses

A pocket full of posies

Ashes! Ashes!

We all fall down.


Ring-a-ring-a roses

A pocket full of posies

A-tishoo! A-tishoo!

We all fall down.

హా హా హా హా హా హా

నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..?

కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని


నట్టింట నడయాడే..చిట్టిపూవు ఏదని..?

కడుపు పండి విరబూసే..పసికందులౌవ్వని


ఇల్లంట వెలిగించే..సిరి దివ్య ఏదనీ..ఈ..?

ఇల్లు మెచ్చి వచ్చినా..శ్రీదేవి..చూపనీ

కొలుచుకొనే దైవాన్ని..కోరుకొనే దేమనీ..?

ఏమనీ..ఈ..?

దిద్దుకొనే..తిలకానికి..దీర్ఘాయువు..ఇమ్మని

దీర్ఘాయువు ఇమ్మని..ఈ


చల్లగాలి చెప్పేది..ఏమని?

చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ



చరణం 2 :


Johny Johny!

Yes, Papa

Eating sugar?

No, papa

Telling lies?

No, Papa

Open your mouth!

Ha! Ha!! Ha!!!

హా హా హా హా హా


ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ

దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ


ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ

దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేది నీవనీ


పగటిపూట ఎండలే..రాత్రిపూట వెన్నెలనీ..ఈ

పంచుకొన్న హృదయాలకు..పగలు రేయి ఒకటనీ


మన జీవిత పయనంలో..చివరికోర్కే..ఏదనీ..??

ఒకరి కన్న ఒకరు ముందు..కన్నుమూసి వెళ్ళాలనీ

మరుజన్మకు..కలవాలనీ..


చల్లగాలి చెప్పేది..ఏమని?

చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ


పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?

పిల్ల పాపలతో..మళ్ళిమళ్ళి రమ్మని

మళ్ళి మళ్ళి..రమ్మని


లాల లాల లాల లాల లాలలా

లాల లాల లాల లాల లాలలా


పాటల ధనుస్సు  


12, మే 2022, గురువారం

మనసంతా మంగళవాద్యాలే | Manasantha Mangala Vadyale | Song Lyrics | Puli Bidda (1981)

మనసంతా మంగళవాద్యాలే



చిత్రం :  పులిబిడ్డ (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే


అనురాగ గీతాల సుమమాలలల్లి..

అనుబంధ గంధాలు మన మీద చల్లి..

దేవతలే.. దీవించువేళ.. 


మనసంతా మంగళవాద్యాలే..

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే.. 


చరణం 1:


చిగురుటాకుల పందిరిలోన 

చిలకపాప పేరంటంలో

కోయిలమ్మ మేళంపెట్టి 

కొంగు కొంగు ముడిపడుతుంటే... 


ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 

ఆశీర్వదించేనులే ఈ వసంతం

ఆనందభాష్పాల పుష్పాంక్షతలతో 

ఆశీర్వదించేనులే ఈ వసంతం

ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం.. 

ఇక మనకు సొంతం


మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే.. 


చరణం 2:


కలలు పండి గెలలేస్తుంటే.. 

కళ్లు నన్ను నిలవేస్తుంటే

ఇద్దరొకటై గదిలో చేరి.. 

నిద్దర కోసం వెతుకుతు వుంటే...


ఏడేడు అడుగుల సప్తస్వరాలు.. 

నా ముద్దుమురిపాల మధురాక్షరాలు

ఏడేడు అడుగుల సప్తస్వరాలు.. 

నా ముద్దుమురిపాల మధురాక్షరాలు

ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు.. 

ఎన్నోవరాలు


మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

మనసంతా మంగళవాద్యాలే.. 

ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే


- పాటల ధనుస్సు 

18, మార్చి 2022, శుక్రవారం

మధుర మురళి హృదయ రవళి | Madhura Murali | Song Lyrics | Oka Radha Iddaru Krishnulu (1986)

మధుర మురళి హృదయ రవళి



చిత్రం :  ఒక రాధ-ఇద్దరు కృష్ణులు (1986)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


మధుర మురళి హృదయ రవళి

అధర సుధల యమున పొరలి... 

పొంగె యద పొంగె

ఈ బృందా విహారాలలోనా..  

నా అందాలు నీవే రా కన్నా

ఈ బృందా విహారాలలోనా...  

నా అందాలు నీవే రా కన్నా


మధుర మురళి హృదయ రవళి

యదలు కలుపు ప్రణయ కడలి...  

సాగే సుడి రేగే

ఈ బృందా విహారాలలోనా...  

ఎవరున్నారు రాధమ్మ కన్నా

ఈ బృందా విహారాలలోనా...  

ఎవరున్నారు రాధమ్మ కన్నా


చరణం 1 :


గోధూళి వేళల్లో.. గోపెమ్మ కౌగిట్లో

లేలేత వన్నే చిన్నే దోచే వేళల్లో 


పున్నాగ తోటల్లో..  సన్నాయి పందిట్లో

నాజూకులన్నీ నాకు దక్కేవేళల్లో 

పగలో అవతారం.. రాత్రో శృంగారం

ఎదలో తారంగం శ్రీవారికీ 


రాగాలెన్నైనా వేణువు ఒకటేలే

రూపాలెన్నైనా హృదయం ఒకటేలే

నాదే నీ గీతము...  

ఇక నీదే ఈ సరసాల సంగీతం 


మధుర మురళి హృదయ రవళి

యదలు పలకు ప్రణయ కడలి... 

సాగే సుడి రేగే

ఈ బృందావిహారాలలోనా... 

నా అందాలు నీవే రా కన్నా

ఈ బృందావిహారాలలోనా... 

ఎవరున్నారు రాధమ్మ కన్నా


చరణం 2 :


హేమంత వేళల్లో...  లే మంచు పందిట్లో

నా వీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే 


కార్తీక వెన్నెల్లో... ఏకాంత సీమల్లో

ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే 


ముద్దే మందారం ... మనసే మకరందం

సిగ్గే సిందూరం శ్రీదేవికీ

అందాలెన్నైనా అందేదొకటేలే

ఆరూ ఋతువుల్లో ఆమని మనదేలే 

పాటే అనురాగము మన బాటే

ఓ అందాల అనుబంధం


మధుర మురళి హృదయ రవళి

అధర సుధల యమున పొరలి... 

పొంగె యద పొంగె 


ఈ బృందావిహారాలలోనా... 

ఎవరున్నారు రాధమ్మ కన్నా

ఈ బృందావిహారాలలోనా...  

నా అందాలు నీవే రా కన్నా


- పాటల ధనుస్సు 

17, జనవరి 2022, సోమవారం

ఏ వసంతమిది ఎవరి సొంతమిది | Ye Vasanthamidi | Song Lyrics | Mosagadu (1971)


Sobhan babu,Sridevi

ఏ వసంతమిది

చిత్రం :  మోసగాడు (1980)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి 

నేపధ్య గానం :  బాలు, సుశీల 



 

పల్లవి :

హహహా.. ఆహహ.. ఆ.. ఆ..

ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఊం... ఊమ్మ్..ఊమ్మ్మ్... 


ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది

ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది 


ఎన్నో ఋతువుల రాగాలు... ఎదలో ప్రేయసి అందాలు

ఎన్నో ఋతువుల రాగాలు... ఎదలో ప్రేయసి అందాలు


ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది 

ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది


ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు 

ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు


చరణం 1 :

ఆమని చీరలు చుట్టుకొని కౌగిలి ఇల్లుగ కట్టుకొని

శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని


చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకా చిలకల్లాగా

చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకా చిలకల్లాగా

ఉయ్యాలూగే వయ్యారంలో... సయ్యాటాడే శృంగారంలో 


ఏ వసంతమిది...  ఎవరి సొంతమిది

ఏ వసంతమిది...  ఎవరి సొంతమిది

ఎన్నో ఋతువుల అందాలు ..ఎదలో ప్రేమ సరాగాలు

ఎన్నో ఋతువుల రాగాలు.. ఎదలో ప్రేయశి అందాలు 

చరణం 2 :

వేసవి గాడ్పులు తట్టుకొని...  ప్రేమను పేరుగ పెట్టుకొని

శ్రావణ సంధ్యల తొలకరి మెరుపులు చూపులుగా నను చుట్టుకొని


జిలిబిలి సిగ్గుల మొగ్గుల మీద జీరాడే  నీ తళుకుల్లాగా

జిలిబిలి సిగ్గుల మొగ్గుల మీద జీరాడే  నీ తళుకుల్లాగా

ఋతువేదైనా అనురాగంలో...  ఎన్నడు వీడనీ అనుబంధంలో


ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది

ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది

ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు

ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు