Sobhan babu,Sridevi |
ఏ వసంతమిది
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హహహా.. ఆహహ.. ఆ.. ఆ..
ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఊం... ఊమ్మ్..ఊమ్మ్మ్...
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఎన్నో ఋతువుల రాగాలు... ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ఋతువుల రాగాలు... ఎదలో ప్రేయసి అందాలు
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు
చరణం 1 :
ఆమని చీరలు చుట్టుకొని కౌగిలి ఇల్లుగ కట్టుకొని
శారద రాత్రుల జాబిలి మల్లెలు పగలే సిగలో పెట్టుకొని
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకా చిలకల్లాగా
చిరు చిరు నవ్వుల పువ్వుల మీద సీతాకోకా చిలకల్లాగా
ఉయ్యాలూగే వయ్యారంలో... సయ్యాటాడే శృంగారంలో
ఏ వసంతమిది... ఎవరి సొంతమిది
ఏ వసంతమిది... ఎవరి సొంతమిది
ఎన్నో ఋతువుల అందాలు ..ఎదలో ప్రేమ సరాగాలు
ఎన్నో ఋతువుల రాగాలు.. ఎదలో ప్రేయశి అందాలు
చరణం 2 :
వేసవి గాడ్పులు తట్టుకొని... ప్రేమను పేరుగ పెట్టుకొని
శ్రావణ సంధ్యల తొలకరి మెరుపులు చూపులుగా నను చుట్టుకొని
జిలిబిలి సిగ్గుల మొగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
జిలిబిలి సిగ్గుల మొగ్గుల మీద జీరాడే నీ తళుకుల్లాగా
ఋతువేదైనా అనురాగంలో... ఎన్నడు వీడనీ అనుబంధంలో
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఏ వసంతమిది.. ఎవరి సొంతమిది
ఎన్నో ఋతువుల రాగాలు ఎదలో ప్రేయసి అందాలు
ఎన్నో ఋతువుల అందాలు... ఎదలో ప్రేమ సరాగాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి