RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, జనవరి 2022, మంగళవారం

ఏ అమ్మ కూతురో | Ye Amma Kuthuro | Song Lyrics | Sirimalle Navvindi (1980)

 ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై


చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం : కె.వి. మహదేవన్ 
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ 
నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :

ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై

జాజిపూల జలకడమాడ వస్తుందని

అనుకున్నానా... వినుకొన్నానా

అనుకున్నదే అవుతుందనుకున్నానా

ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై

మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని

అనుకున్నానా... వినుకొన్నానా 

అనుకున్నదే అవుతుందనుకున్నానా 
ఏ అమ్మ కూతురో...

ఏ కొంటెపిల్లడో...


చరణం 1 :

ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... 
పోతుంటే పోతుంటే

ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే 
పోతుంటే పోతుంటే

ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... 
పోతుంటే 
ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే... 
పోతుంటే

ఏరంతా కెరటాలు... 
మన జంట సరదాలు
ఏరంతా కెరటాలు... 
మన జంట సరదాలు

ఏలలే పాడుతూ గాలిలో తేలుతూ
పూలలో వాలుతూ పులకరించి 
పోతుంటే

ఏ అమ్మ కూతురో...
ఏ అమ్మ కూతురో...


చరణం 2

ఎన్నెలే కోకల్లెకట్టి నువ్వస్తుంటే 
వస్తుంటే
చుక్కలే చూపులై నా వంకే చూస్తుంటే 
చూస్తుంటే

ఏలా మోమాటాలు... 
మనకేలా పరదాలు
తేనెలా వానలో తీయని వరదలో
వణుకుతూ తేలుతూ 
ముద్దాడవస్తుంటే

ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై
మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని
అనుకున్నానా... వినుకొన్నానా
అనుకున్నదే అవుతుందనుకున్నానా 

లాలలలల్ల్లా... లాలాలలాలలా


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు