RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, జనవరి 2022, మంగళవారం

ఎంతో రసికుడు దేవుడు | బాలు | Entho Rasikudu Devudu | Balu | Song Lyrics | Raja Ramesh (1977)

 ఎంతో రసికుడు దేవుడు (SP Balu) 




చిత్రం : రాజా రమేష్ (1977)

సంగీతం :  కె.వి. మహదేవన్

నేపధ్య గానం :  SP Balu,

రచన : ఆచార్య ఆత్రేయ


పల్లవి :


ఎంతో రసికుడు దేవుడు

ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు

అన్నిటిలో నిన్నే చూడమన్నాడు


ఎంతో..ఓ.. రసికుడు దేవుడు

ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు

అన్నిటిలో నిన్నే చూడమన్నాడు


ఎంతో రసికుడు దేవుడు...ఊ... 


చరణం 1:


పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు

రంగులన్ని రంగరించి పూత పూసినాడు

పువ్వులన్ని ఏరి నీ బొమ్మ చేసినాడు

రంగులన్ని రంగరించి పూత పూసినాడు


ఆ ఘుమఘుమలు గుమ్మరించి శ్వాస నింపినాడు

నీ శ్వాస నింపినాడూ...

నీ పెదవులలో పూదేనియ పొదిగి తీర్చినాడూ...ఊ..


ఎంతో రసికుడు దేవుడు... 


చరణం 2:


నల్లని కురులులోకి మల్లెపూలు సొగసు

పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు

నల్లని కురులులోకి మల్లెపూలు సొగసు

పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు


ముద్దులొలుకు మోముకు ముద్దబంతి పొందికా...ఆ...

మొత్తంగా ఏ పువ్వు నీకు సాటిరాదుగా...ఆ...


ఎంతో రసికుడు దేవుడు

ఎన్ని పువ్వులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడు

అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో రసికుడు దేవుడు...


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు