RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, జనవరి 2022, శనివారం

ఈ రాతిరీ ఓ చందమామా | Ee Ratiri o chandamama | Song Lyrics | దొంగలకు దొంగ (1977)

ఈ రాతిరీ ఓ చందమామా



చిత్రం: దొంగలకు దొంగ (1977)

సంగీతం: సత్యం

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


ఈ రాతిరీ ఓ చందమామా..

ఎట్లా గడిపేదీ అయ్యో రామా..

ఈ రాతిరీ ఓ చందమామా..

ఎట్లా గడిపేదీ అయ్యో రామా..


చాటుగ నను చేరి అల్లరి పెడుతుంటె 

నీతో వేగేదెలా..

ఈ రాతిరీ ఓ చందమామా..

ఎట్లా గడిపేదీ అయ్యో రామా..


చరణం 1:


వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవూ

గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవూ

ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరు

నీతో గడిపేదెలా...


ఈ రాతిరీ ఓ చందమామా..

ఎట్లా గడిపేదీ అయ్యో రామా


చరణం 2:


నిన్ను చూసి లేత కలువ విరిసిందీ

తెల్లవార్లూ మోటు సరసం తగదందీ

ఒకసారి ఔనంటె వదిలేది లేదంటె

ఎట్లా తాళేదిరా...


ఈ రాతిరీ ఓ చందమామా..

ఎట్లా గడిపేదీ అయ్యో రామా..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు