RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జనవరి 2022, గురువారం

ఎదురుగా నీవుంటే | Eduruga Nee Vunte | Song Lyrics | Mahatmudu (1976)

ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో




చిత్రం :  మహాత్ముడు (1976)
సంగీతం :  టి.చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి :


ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే

చరణం 1 :

నీవాలు కన్నులలోన 
నీలాల రాగాలెన్నో
నీవాలు కన్నులలోన 
నీలాల రాగాలెన్నో

నీ చిగురు మోవిపైన 
సిరికెంపుల రాగాలెన్నో
నీ చిగురు మోవిపైన 
సిరికెంపుల రాగాలెన్నో

నిత్యవసంతుడు 
నీడగవుంటే..
నిత్యవసంతుడు 
నీడగవుంటే.. 
చిత్రవర్ణ రాగాలెన్నో  

ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే..

చరణం 2 :

కమల రమణి విరమూయునులే 
అరుణోదయ వేళలో..
కలువ చెలువ తెరతీయునులే 
చంద్రోదయ వేళలో

కమల రమణి విరమూయునులే 
అరుణోదయ వేళలో..
కలువ చెలువ తెరతీయునులే 
చంద్రోదయ వేళలో

వలచిన హృదయం 
పులకించునులే..
వలచిన హృదయం 
పులకించునులే.. 
చెలి వలపుల జోలలో    

ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే

చరణం 3 :


మనసైన పందిరి కోసం 
మరుమల్లె తీగసాగె

మనసైన పందిరి కోసం 
మరుమల్లె తీగసాగె

సెలయేటి కలయిక కోసం 
కడలిరేడు తానెదురేగె
సెలయేటి కలయిక కోసం 
కడలిరేడు తానెదురేగె 

ఆ అల్లికలో ఆ కలయికలో
ఆ అల్లికలో ఆ కలయికలో..  
అనురాగ వీణ మ్రోగె         
 
ఎదురుగా నీవుంటే 
ఎన్నెన్ని రాగాలో
చల్లని నీ మదిలో 
ఏ శ్రావణ మేఘాలో.. 
ఎదురుగా నీవుంటే


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు