RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జనవరి 2022, బుధవారం

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన | Neelagiri challana | Song Lyrics | జీవితంలో వసంతం (1977)

 నీలగిరి చల్లన నీ వడి వెచ్చన



చిత్రం: జీవితంలో వసంతం (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం


పల్లవి: నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నువ్వు నేను ఒకటైతే

నూరేళ్ళు పచ్చన నీ మది కోవెల అన్నది కోయిల నీ జత నేనుంటే బ్రతుకే ఊయల

నీలాల మబ్బులలో... తేలి తేలి పోదామా

సోలి సోలి పోదామా ప్రియతమా...ప్రియతమా ఓ ఓ ఓ

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన

నీ మది కోవెల అన్నది కోయిల

చరణం 1: నీ లేడి కన్నులలో మెరిసే తారకలు నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు

నీ మాట వరసలలో వలపే వెల్లువగా నీ పాట తోటలలో పిలుపే వేణువుగా

పులకించిన నా మదిలో

పలికించిన రాగాలు చెలరేగిన వయసులో

తీయని అనురాగాలు ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ ఇదే ఇదేలే జీవితం

అహహహహ జీవితంలో వసంతం నీలాల మబ్బులలో.... తేలి తేలి పోదామా

సోలి సోలి పోదామా చరణం 2: ఈ ఏటి తరగలలో

గలగలలే నీ గాజులుగా ఈ కొండగాలులలో హా

గుసగుసలే నీ ఊసులుగా

ఈ సంధ్య వెలుగులలో

కలయికలే కవితలుగా ఈ కౌగిలింతలలో

అల్లికలే మమతలుగా

తొలి పువ్వుల చిరునవ్వుల

సిరిమువ్వల సవ్వడిలో మరుమల్లెల విరిజల్లుల

మనసిచ్చిన నీ వడిలో

ఇదే ఇదేలే జీవితం లలాలలా

జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ

ఇదే ఇదేలే జీవితం

అహహహహ

జీవితంలో వసంతం

నీలాల మబ్బులలో...

నీలాల మబ్బులలో తేలి తేలి పోదామా...

తేలి తేలి పోదామా సోలి సోలిపోదామా


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు