RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జనవరి 2022, బుధవారం

ఎగిరే గాలిపటానికి | Egire Gali pataniki | Song Lyrics | Ram Rahim (1974)

 ఎగిరే గాలిపటానికి



చిత్రం :  రామ్ రహీమ్ (1974)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం..
ఎగిరే గాలిపటానికి.. దారం ఆధారం 
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం 1 :
ప్రేమే ఒక కలిమి . . దానికి లేనే లేదు లేమి
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
నా మనసే నిను వలచింది.. ఆ వలపే జత కలిపిందీ
కలిసిన జంటల విడదీస్తుంది కాలం కాలం
ఆ కాలానికి ఎదురీదీ.. చేరుకుందాము ఆవలి తీరం  
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం

చరణం 2 :
ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఏ సుడిగాలి వీస్తుందో... ఏ జడివాన వస్తుందో
ఈ బంధం గాలిపటంలా... ఏ నిమిషం ఏమవుతుందో
గాలికి చెదరదు...  వానకు తడవదు బంధం . . . మన బంధం
అది ఎగరేసే ఒడుపుంటే...  నిలిచిపోతుంది కలకాలం 
ఎగిరే గాలిపటానికి దారం ఆధారం...
నా నిరుపేద జీవితానికి నీ ప్రేమే ఆధారం
అహహా అహహా అహాహా హ్హా..అహహా అహహా అహాహా హ్హా..


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు