RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, జనవరి 2022, గురువారం

కురిసెను హృదయములో | Kurisenu Hrudayamulo | Song Lyrics | Nenu Naa Desam (1974)

 కురిసెను హృదయములో



చిత్రం : నేను నా దేశం (1974) సంగీతం : సత్యం గీతరచయిత : అంకిశ్రీ నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల


పల్లవి : కురిసెను హృదయములో తేనె జల్లులు విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు... కురిసెను కన్నులలో పూలవానలు విరిసెను నాలోనే ప్రేమ మాలలు... కురిసెను హృదయములో తేనె జల్లులు విరిసెను నాలోనే ప్రేమ మాలలు... చరణం 1 : పగలే వెన్నెల మయము... ఈ జగమే నందన వనము నా తలపులు పండే.. వలపులు నిండే.. మోజులే రేపే నాలో మనసే ప్రేమాలయము... అతి సుందర బృందావనము తొలి చూపుల నెలము.. కలిసెను మనము.. ఆశలు రేగే నాలో.. ఓ ప్రియా.. ఆ.. ఆ..ఆ.. కురిసెను హృదయములో తేనె జల్లులు విరిసెను నాలోనే ప్రేమ మాలలు... చరణం 2 : పెదవులలో మధురిమలు.. నీ నడకలలో మగసిరులు అనురాగములొలికే తీయని పలుకే... విందులు చేసె నాలో కన్నులలో నయగారం... నీ నడకలలో వయ్యారం... ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే... తొందర చేసె నాలో ఓ చెలి... ఈ.. ఈ.. ఈ.. కురిసెను కన్నులలో పూలవానలు విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు...


- పాటల ధనుస్సు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే | Godariki Ye oddaina | Song Lyrics | Mana Oori Katha (1976)

గోదారికి ఏ ఒడ్డైనా నీరు ఒక్కటే చిత్రం :  మన ఊరి కథ (1976) సంగీతం :  జె.వి. రాఘవులు గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం :  బాలు, సుశీల  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు