మావ కూతురా నీతో మాటున్నదీ
చిత్రం : మన ఊరి కథ (1979)
రచన : మైలవరపు గోపి ,
సంగీతం : J V రాఘవులు,
గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,
పల్లవి:
మావ కూతురా నీతో మాటున్నదీ
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే
జొన్నచేను చాటున్నదీ..ఈ.
చాటున్నది
మావ కూతురా.. ఆ..ఆ.. ఓ.. ఓ...
వగలమారి బావయ్యా..
రభస చెయ్యకు
పగలు రాత్రి లేకుండా
దారి కాయకు
నువ్వు దారి కాసి నలుగురిలో
అలుసు చేయకు..ఊ..
నా పరువు తియ్యకు...
వగలమారి బావయ్యా... ఆ.. ఓ.. ఓ..
చరణం: 1
యాతమెక్కుదామన్నా నీ ఊసే ..
అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...
యాతమెక్కుదామన్నా నీ ఊసే ..
అరక దున్నుతూ ఉన్నా ఆ ధ్యాసే...
పూలు ముడువబోతున్నా నీ ఊసే...
నే చల్ల చిలక బోతున్నా
ఆ ధ్యాసే... ఓ.. ఓ.. ఓ..
మావ కూతురా నీతో మాటున్నది
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే
జొన్నచేను చాటున్నదీ..ఈ.
చాటున్నది
మావ కూతురా.. ఆ.. ఆ.. ఓ.. ఆ.....
చరణం: 2
పగలంతా కోరికతో తెలవారే...
రేయేమో పగటి కలలు సరిపోయే...
పగలంతా కోరికతో తెలవారే... హాయ్..
రేయేమో పగటి కలలు సరిపోయే...
వలపేమో నీ చెంతకు తరిమింది...
పాడు సిగ్గేమో పగ్గమేసి లాగింది... ఓ..ఓ..
మావ కూతురా నీతో మాటున్నది
పడుచు గుండె నీ పొందే కోరుతున్నది
నువ్వు అవునంటే
జొన్నచేను చాటున్నదీ..ఈ.
చాటున్నది
మావ కూతురా.. ఆ..ఆ.. ఏ.. ఓ..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి