RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, జనవరి 2022, ఆదివారం

ఓహో లలితా నా ప్రేమ కవితా | Oho Lalitha Naa prema kavitha | Song Lyrics | Mallepoovu (1978)

ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా



చిత్రం :  మల్లెపువ్వు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆరుద్ర 

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి:


ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా


గగనవీణ సరిగమలు పాడగా..

ఆ ఆ ఆ ఆఆ

నీ జఘనసీమ స్వరజతులనాడగా..

ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ

తళత్తళలతో తరుణ కిరణ సంచలిత లలిత 

శృంగార తటిల్లత కదలగా

కనులు చెదరగా..

కదలిరా..కవితలా..వలపుకే..వరదలా...

ఓహో..హో..హో..లలితా.. నా ప్రేమ కవితా..


చరణం 1:


మల్లెపూవులు మధువు పొంగులా వెల్లువైన కవితా..

నీ కన్నెవయసు నా ఇంద్రధనుస్సుగా 

కదలిరావే నా లలితా


గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా

కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా


నీ అందాలే మకరందాలై మల్లె సుగంధం నాలో విరిసే

సిగమల్లె పిలుపులో అందుకో

సిరిమల్లె తీగవై అల్లుకో


ఈ మల్లెపూవే నీ సొంతము


కదలిరా.. కవితలా..వలపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా 

నాప్రేమ కవితా



చరణం 2:


వయసు తోటలో మనసు పాటలా వెల్లివిరిసెలే నీ కథా

నా అణువు అణువు నీ వలపు వేణువై ఝుల్లుమన్నదీ నా ఎదా


తెలుగు పాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా

పూల ౠతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా


నీ ఊహలలో నే ఊర్వశినై నీ కౌగిలికి నే జాబిలినై


నీ కాలిమువ్వ నా కవితగా నా దారిదివ్వె నీ మమతగా


ఈ మల్లెపూవే నా లలితగా

కదలిరా కవితలా వలుపుకే వరదలా


ఓహో హోహో లలితా నా ప్రేమకవితా నాప్రేమ కవితా


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు