RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ilayaraja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ilayaraja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జూన్ 2026, మంగళవారం

తం తన నంతన తాళంలో | Tamtana Nantana Thalamlo | Song Lyrics | Kotha Jeevithalu (1980)

తం తన నంతన తాళంలో 


చిత్రం: కొత్త జీవితాలు (1980)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఎస్ జానకి, పి సుశీల


పల్లవి:


తననం...తననం...

తననం...తననం..త...

ఆ....ఆ....ఆ...ఆ...ఆ...ఆ...ఆ..ఆ..

తం...తననం..తననం...

తననం...తననం...

తం తన నంతన తాళంలో.. 

రస రాగంలో

మృదునాదంలో ..

నవ జీవన భావన పలికెనులే

తం తన నంతన తాళంలో.. 

రస రాగంలో

మృదునాదంలో ..

నవ జీవన భావన పలికెనులే


నవ భావనయే సుమ మోహనమై...

ఆపై వలపై పిలుపై కళలోలుకగ

తం తన నంతన తాళంలో.. 

మృదునాదంలో..

నవ జీవన భావన పలికెనులే


చరణం 1:


తనన తని నననని నననని తనన

తని నననని నననని తనన

తని నననని నననని తనన..

తనన తనన..


ఉల్లము ఝల్లన 

అల్లరి తెమ్మెర వీచెనులే...

మది దోచెనులే...

మరు మల్లెలు సైగలు చేసెనులే

ఆ....ఆ...ఆ...ఆ...


ఉల్లము ఝల్లన 

అల్లరి తెమ్మెర వీచెనులే...

మది దోచెనులే...

మరు మల్లెలు సైగలు చేసెనులే...


కన్నియ ఊహలు వెన్నెలలై...

కదలే కదలే విరి ఊయలలై

పున్నమి వేసిన ముగ్గులలో...

కన్నులు దాటిన సిగ్గులలో

తేనెలకందని తీయని కోరికలే...

చిరు మరులని చిలుకగ


తం తన నంతన తాళంలో..

రసరాగంలో మృదునాదంలో...

నవ జీవన భావన పలికెనులే


చరణం 2:


ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ..

పొంచిన మదనుడు పువ్వుల బాణం...

నాటెనులే..ఎద మీటెనులే

పులకింతలు హద్దులు దాటెనులే

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...

పొంచిన మదనుడు పువ్వుల బాణం...

నాటెనులే..ఎద మీటెనులే

పులకింతలు హద్దులు దాటెనులే


మ్రోగెను పరువం రాగిణియై... 

మురిసే మురిసే చెలి మోహినియై

వన్నెల తుంటల పందిరిలో...

వెన్నెల రాయని కౌగిలిలో

ఇద్దరి పెదవుల ముద్దుల అల్లికలే...

మృదుమధురిమలోలుకగ


తం తన నంతన తాళంలో...

రస రాగంలో మృదునాదంలో

నవ జీవన భావన పలికెనులే...

నవ భావనయే సుమమోహనమై...

ఆపై వలపై పిలుపై కళలొలుకగ...

తం తననం తననం 

తననం తననం తననం


- పాటల ధనుస్సు 


పొంగి పొరలే అందాలెన్నో | Pongiporale Andalenno | Song Lyrics | Kotha Jeevithalu (1980)

పొంగి పొరలే అందాలెన్నో


చిత్రం: కొత్త జీవితాలు (1980)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి:


పొంగి పొరలే ...అందాలెన్నో 

పొంగి పొరలే...


కన్నెమదిలో అందాలెన్నో 

పొంగి పొరలే...

కన్నెమదిలో అందాలెన్నో 

పొంగి పొరలే...

కోనల్లోనా.. లోయల్లోనా 

నేల పైన నింగి కదలే...

వన్నెకాడు నన్ను కలిసే...


చరణం 1:


పూలే రమ్మనగా... 

పరువాలే ఝుమ్మనగా

పూలే రమ్మనగా... 

పరువాలే ఝుమ్మనగా

పవనాలే జిల్లనగా...

హృదయాలే జల్లనగా


పొంగి పొరలే అందాలెన్నో ..

పొంగి పొరలే

కోనల్లోనా... లోయల్లోనా...

నేల పైన నింగి కదలే

వన్నెకాడు నిన్ను కలిసే....


చరణం 2 :


కోయిల పాటలలోనా... 

ఆ కోవెల గంటలలోనా

కోయిల పాటలలోనా... 

ఆ కోవెల గంటలలోనా

మ్రోగిందీ... రాగం... 

మ్రోగిందీ... రాగం..

ఆడిందీ తాళం... 

అది నీ కోసం...హా.హా.హా


కన్నెమదిలో అందాలెన్నో... 

పొంగి పొరలే 

కోనల్లోనా లోయల్లోనా... 

నేల పైన నింగి కదిలే 

వన్నెకాడు నన్ను కలిసే


చరణం 3 :


పాటలు నేర్చే భామా... 

తొలిపాఠంలే మన ప్రేమా

పాటలు నేర్చే భామా... 

తొలిపాఠంలే మన ప్రేమా

కన్నుల్లో... మౌనం...

కన్నుల్లో... మౌనం...

నవ్వుల్లో గానం... 

అది నా కోసం...హా.హా.హా..


పొంగి పొరలే అందాలెన్నో..

పొంగి పొరలే

కోనల్లోనా.. లోయల్లోనా..

నేల పైన నింగి కదలే

వన్నెకాడు నిన్ను కలిసే...


- పాటల ధనుస్సు 


15, మే 2026, శుక్రవారం

ఏవేవో కలలు కన్నాను మదిలో | Evevo Kalalukannanu Madilo | Song Lyrics | Jwala (1985)

ఏవేవో కలలు కన్నాను మదిలో 


చిత్రం : జ్వాల (1985 )

రచన : మైలవరపు గోపి 

సంగీతం : ఇళయరాజా  

గానం : ఎస్ జానకి  


పల్లవి : 


ఏవేవో కలలు కన్నాను మదిలో

ఏవేవో కలలు కన్నాను మదిలో


మౌన మురళి నయి విరహ వీణయి

శ్వామి గుడికి చేరువయిన వేలలో

ఏవేవో కలలు కన్నాను మదిలో


చరణం 1:


సుడిగాలులలో వెలిగే దీపం

ఈ కోవెలలో ఎటు చేరినదో


ఏ జన్మలోని బంధమొ

ఇదే రుణాను బంధమొ

ఏ జన్మలోని బంధమొ

ఇదే రుణాను బంధమొ


నీకు నేను బానిసయి

నాకు నువ్వు బాసటయి

సాగిపోవు పదనిసలు

ఏవేవో కలలు కన్నను మదిలో


చరణం 2:


నా కన్నులలో వెలుగయి నిలిచీ

సిరి వెన్నెలగా బ్రతుకే మలిచి


నిట్టుర్పుగొన్న గుండెకు

ఓదార్పు చూపినావురా

నిట్టుర్పుగొన్న గుండెకు

ఓదార్పు చూపినావురా


నాది పేద మనసురా

కాంకలీయ లేనురా

కనులనీరె కానుకర


ఏవేవో కలలు కన్నాను మదిలో

ఏవేవో కలలు కన్నాను మదిలో


మౌన మురళి నయి విరహ వీణయి

శ్వామి గుడికి చేరువయిన వేలలో


- పాటల ధనుస్సు 



13, ఏప్రిల్ 2026, సోమవారం

సరసాలు చాలు శ్రీవారు | Sarasalu Chalu Srivaru | Song Lyrics | Shiva (1989)

సరసాలు చాలు శ్రీవారు


చిత్రం : శివ (1989)

సంగీతం : ఇళయరాజా

రచన : సిరివెన్నెల 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి  


పల్లవి :


సరసాలు చాలు శ్రీవారు.. 

వేళ కాదు

విరహాల గోల ఇంకానా.. 

వీలు కాదు

సరసాలు చాలు శ్రీవారు.. 

వేళ కాదు

విరహాల గోల ఇంకానా.. 

వీలు కాదు

వంటిట్లో గారాలు.. 

ఒళ్ళంతా కారాలే సారు


చురుకైన ఈడు ఒద్దన్నా 

ఊరుకోదు

విరజాజి పూలు వంటిట్లో 

వాడరాదు


చరణం 1 :


సూర్యుడే చుర చుర చూసినా.. 

చీరనే వదలరు.. చీకటే చెరిగినా

కాకులే కేకలు వేసినా.. 

కౌగిలే వదలను.. 

వాకిలే పిలిచినా


స్నానానికే సాయమే 

రావాలనే తగువా

నీ చూపులే సోపుగా 

కావాలనే సరదా

పాపిడి తీసి.. పౌడరు పూసి 

బైటికే పంపేయనా

పైటతో పాటే లోనికిరానా.. 

పాపలా పారాడనా

తియ్యగా తిడుతూనే.. 

లాలించనా


సరసాలు చాలు శ్రీవారు.. 

తాన నాన

విరహాల గోల ఇంకానా.. 

ఊహు ఊహు


చరణం 2 :


కొత్తగా కుదిరిన వేడుక.. 

మత్తుగా పెదవుల నీడకే చేరదా

ఎందుకో తికమక తొందర.. 

బొత్తిగా కుదురుగా 

ఉండనే ఉండదా


ఆరారగా చేరక 

తీరేదెలా గొడవ

ఆరాటమే ఆగదా 

సాయంత్రమే పడదా

మోహమే తీరే మూర్తమే రాదా 

మోజులే చెల్లించవా

జాబిలే రాడా జాజులే తేడా 

రాతిరే రాదా ఇక

ఆగదే అందాక ఈడు గోల


చురుకైన ఈడు ఒద్దన్నా 

ఊరుకోదు

విరజాజి పూలు వంటిట్లో 

వాడరాదు

ఊరించే దూరాలు.. 

ఊ అంటే తియ్యంగా తీరు

సరసాలు చాలు శ్రీవారు 

వేళ కాదు

లలలలలా.. 

అహహహహహా.

హ్హాహాహహాహహహా


- పాటల ధనుస్సు 



12, ఏప్రిల్ 2026, ఆదివారం

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే | Yedalo Tholi Valape | Song Lyrics | Erra Gulabilu (1979)

ఎదలో తొలి వలపే విరహం జత కలిసే


చిత్రం: ఎర్ర గులాబీలు (1979)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


లలలలల లా..

ఎదలో తొలి వలపే 

విరహం జత కలిసే

మధురం ఆ తలపే 

నీ పిలుపే..ఏ..ఏ


ఎదలో తొలి వలపే 

విరహం జత కలిసే

మధురం ఆ తలపే 

నీ పిలుపే..ఏ..ఏ


ఎదలో తొలి వలపే..


చరణం 1:


రోజాలతో పూజించనీ.. 

విరి తెనెలే నను తాగనీ

నా యవ్వనం పులకించనీ.. 

అనురాగమే పలికించనీ

కలగన్నదీ నిజమైనదీ..

కథలే నడిపిందీ..ఈ..ఈ..


ఎదలో తొలి వలపే 

విరహం జత కలిసే

మధురం ఆ తలపే 

నీ పిలుపే..ఏ..ఏ


ఎదలో తొలి వలపే..


చరణం 2:


పయనించనా నీ బాటలో.. 

మురిపించనా నా ప్రేమలో

ఈ కమ్మనీ తొలి రేయిని.. 

కొనసాగనీ మన జంటనీ

మోహాలలో మన ఊహలే..

సాగే చేలరేగే..ఏ..ఏ..


ఎదలో తొలి వలపే 

విరహం జత కలిసే

మధురం ఆ తలపే 

నీ పిలుపే..ఏ..ఏ


ఎదలో తొలి వలపే 

విరహం జత కలిసే

మధురం ఆ తలపే 

నీ పిలుపే..ఏ..ఏ


ఎదలో తొలి వలపే...


- పాటల ధనుస్సు 


29, మార్చి 2026, ఆదివారం

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ | Urakalai Godavari | Song Lyrics | Abhilasha (1983)

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ


చిత్రం: అభిలాష (1983) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: ఎస్ పి బాలు, ఎస్ జానకి  

 

పల్లవి: 


ఉరకలై గోదావరీ 

ఉరికె నా ఒడిలోనికీ 

సొగసులై బృందావనీ 

విరిసె నా సిగలోనికీ 

జత వెతుకు హృదయానికీ 

శృతి తెలిపె మురళీ 

చిగురాకు చరణాలకీ 

సిరిమువ్వ రవళీ 

రసమయం జగతీ 

ఉరకలై గోదావరీ 

ఉరికె నా ఒడిలోనికీ 


చరణం 1: 


నీ ప్రణయ భావం 

నా జీవరాగం 

నీ ప్రణయ భావం 

నా జీవరాగం 

రాగాలూ తెలిపే 

భావాలూ నిజమైనవీ 

లోకాలూ మురిసే 

స్నేహాలు ఋజువైనవీ 

అనురాగ రాగాలా 

స్వరలోకమే మనదైనదీ 


ఉరకలై గోదావరీ 

ఉరికె నా ఒడిలోనికీ 

జత వెతుకు హృదయానికీ 

శృతి తెలిపె మురళీ 

చిగురాకు చరణాలకీ 

సిరిమువ్వ రవళీ 

రసమయం జగతీ 


చరణం 2: 


నా పేద హృదయం 

నీ ప్రేమ నిలయం 

నా పేద హృదయం 

నీ ప్రేమ నిలయం 

నాదైన బ్రతుకే 

ఏనాడో నీదైనదీ 

నీవన్న మనిషే 

ఈనాడూ నాదైనదీ 

ఒక గుండె అభిలాషా 

పదిమందికీ బ్రతుకైనదీ 


ఉరకలై గోదావరీ 

ఉరికె నా ఒడిలోనికీ 

సొగసులై బృందావనీ 

విరిసె నా సిగలోనికీ 

జత వెతుకు హృదయానికీ 

శృతి తెలిపె మురళీ 

చిగురాకు చరణాలకీ 

సిరిమువ్వ రవళీ 

రసమయం జగతీ


- పాటల ధనుస్సు 


28, మార్చి 2026, శనివారం

నవ్వింది మల్లె చెండు | Navvindi Malle Chendu | Song Lyrics | Abhilasha (1983)

నవ్వింది మల్లె చెండు


చిత్రం : అభిలాష (1983) 

సంగీతం : ఇళయరాజా 

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి  


పల్లవి  :


యురేకా....

తారత్త తారత్త తారత్తా

తారత్త తారత్త తారత్తా


నవ్వింది మల్లె చెండు... 

నచ్చింది గర్ల్ ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు... 

జరుపుకో భలే రొమాన్సు

యురేక సకమికా... 

నీ ముద్దు తీరేదాకా


నవ్వింది మల్లె చెండు... 

నచ్చింది గర్ల్ ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు... 

జరుపుకో భలే రొమాన్సు

యురేక సకమికా...

సకమిక సకమిక సకమిక సకమికా 


చరణం 1 :


నవ్వు సిగ్నల్ నాకివ్వగానే... 

నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే

నవ్వుతోనె కదిలెయ్యగానె...  

నాటుకున్నాయ్ నవనందనాలే

అహ చూపుల్లో నీ రూపం... 

కనురెప్పల్లో నీ తాళం

కన్నుకొట్టి కమ్ముకుంట... 

కాలమంత అమ్ముకుంట

రపప్ప రపప్ప...  

రపప్పా రపప్ప

కన్నె ఈడు జున్నులన్ని 

జుర్రుకుంటా 


నవ్వింది మల్లె చెండు...  

నచ్చింది గర్ల్ ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు...  

జరుపుకో భలే రొమాన్సు

యురేక సకమికా... హా హా హా 


చరణం 2 :


కస్సుమన్న ఓ కన్నెపిల్ల...  

యస్సు అంటే ఓ కౌగిలింత

కిస్సులిచ్చి  నే  కౌగిలిస్తే... 

అరె తీరిపోయే నాకున్న చింత

నేను పుట్టిందే నీకోసం...  

ఈ జన్మంతా నీ ధ్యానం

ముద్దు పెట్టీ మొక్కుకుంటా... 

మూడు ముళ్ళు వేసుకొంటా

షబబ్బా రిబబ్బా షబబ్బా 

రిబబ్బ రిబరిబ

ఏడు జన్మలేలుకుంటా 

నేను జంటగా 


నవ్వింది మల్లె చెండు... 

నచ్చింది గర్ల్ ఫ్రెండు

దొరికెరా మజాగ ఛాన్సు... 

జరుపుకో భలే రొమాన్సు

యురేక సకమికా... 

నీ ముద్దు తీరేదాకా

యురేక సకమికా... 

నీ ముద్దు తీరేదాకా

యురేక సకమికా... 

నీ ముద్దు తీరేదాకా...  హుర్రే


- పాటల ధనుస్సు 


12, జనవరి 2026, సోమవారం

ఏనాడు విడిపోని ముడి వేసెనే | Yenadu Vidiponi | Song Lyrics | Sri Kanakamahalakshmi Recording Dance Troop (1988)

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చిత్రం : శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)

రచన :  వేటూరి సుందరరామమూర్తి  

సంగీతం : ఇళయరాజా  

గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

ఈ మధుర యామినిని


ఏ జన్మ స్వప్నాల అనురాగమో

ఏ జన్మ స్వప్నాల అనురాగమో

పూసినది నేడు ఈ పసుపు తాడు

పూసినది నేడు ఈ పసుపు తాడు

ఈ సుచల ఆమనిని


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చరణం 1:


మోహాన పారాడు వేలి కొనలో

నీ మేను కాదా చైత్ర వీణ

వేవేల స్వప్నాల వేడుకలలో

నీ చూపు కాదా పూల వాన

రాగసుధ పారే అలల శృతిలో

స్వాగతము పాడే ప్రణయము

కలకాలము కలగానమై

నిలవాలి మన కోసము ఈ మమత


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చరణం 2: 


నీ మోవి మౌనాన మదన రాగం

మోహాన సాగే మదుప గానం

ఏ మోవి పూసింది చైత్ర మోదం

చిగురాకు తీసే వేణు నాదం

పాపలుగ వెలిసే పసిడి కలకు

ఊయలను వేసే క్షణమిదే

రేపన్నది ఈ పూటనే

చేరింది మన జంటకు ముచ్చటగ


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

పూసినది నేడు ఈ పసుపు తాడు

ఈ మధుర యామినిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


- పాటల ధనుస్సు 

14, డిసెంబర్ 2025, ఆదివారం

అందాలలో అహో మహోదయం | Andalalo Aho Mahodayam | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

అందాలలో అహో మహోదయం


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


లా లా ల ల ల లా 

లా లా ల ల ల లా 

అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం 

పువ్వూ నవ్వూ పులకించే గాలిలో 

నింగీ నేలా చుంబించే లాలిలో 

తారల్లారా రారే విహారమే 


అందాలలో అహో మహోదయం 

నా చూపుకే శుభోదయం 


చరణం 1: 


లతా లతా సరాగమాడే 

సుహాసిని సుమాలతో 

వయస్సుతో వసంతమాడీ 

వరించెలే సరాలతో 

మిలా మిలా హిమాలే 

జలా జలా ముత్యాలుగా 

తళా తళా గళాన 

తటిల్లతా హారాలుగా 

చేతులు తాకిన కొండలకే 

చలనము వచ్చెనులే 

ముందుకు సాగిన ముచ్చటలో 

మువ్వలు పలికెనులే 

ఒక స్వర్గం తలవంచి 

ఇల చేరే క్షణాలలో 

అందాలలో అహో మహోదయం.. 

భూలోకమే నవోదయం 


చరణం 2: 


సరస్సులో శరత్తు కోసం 

తపస్సులే ఫలించగా 

సువర్ణిక సుగంధమేదో 

మనస్సునే హరించగా 

మరాళినై ఇలాగే మరీ 

మరీ నటించనా 

విహారినై ఇవాళే దివి 

భువి స్పృశించనా 

గ్రహములు పాడిన పల్లవికే 

జాబిలి ఊగెనులే 

కొమ్మలు తాకిన ఆమనికే 

కోయిల పుట్టెనులే 

ఒక సౌఖ్యం తనువంతా 

చెలరేగే క్షణాలలో 


అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం 

నీలాకాశం దిగివచ్చే లోయలో 

ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో 

నాలో సాగే ఏదో సరాగమే 


అందాలలో అహో మహోదయం 

భూలోకమే నవోదయం


- పాటల ధనుస్సు 


అబ్బనీ తియ్యనీ దెబ్బ | Abbaneeteeyani Debba | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

అబ్బనీ తియ్యనీ దెబ్బ



చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

అబ్బనీ తీయనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ


చరణం 1:


చిటపట నడుముల ఊపులో 

ఒక ఇరుసున వరసలు కలవగా

ముసిరిన కసికసి వయసులో 

ఒక ఎదనస పదనిస కలవుగా

కాదంటూనే కలబడు 

అది లేదంటూనే ముడిపడు

ఏమంటున్నా మదనుడు 

తెగ ప్రేమించాక వదలడు

చూస్తా సొగసు కోస్తా 

వయసు నిలబడు కౌగిట


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గా ఆఁ...


చరణం 2:


అడగక అడిగినదేవిఁటో లిపి 

చిలిపిగ ముదిరిన కవితగా

అది విని అదిమిన షోకులో 

పురి విడిచిన నెమలికి సవతిగా

నిన్నే నావి పెదవులు 

అవి నేడైనాయి మధువులు

రెండున్నాయి తనువులు 

అవి రేపవ్వాలి మనువులు

వస్తా వలచి వస్తా మనకు 

ముదిరెను ముచ్చట


అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

పురుషుల్లోనా పుంగవా 

పులకింతొస్తే ఆగవా

వయ్యారాల వెల్లువ 

వాటేస్తుంటే వారెవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ 

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ 

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ


- పాటల ధనుస్సు 


జై చిరంజీవా జగదేక వీరా | Jai Chiranjeeva Jagadekaveera | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

జై చిరంజీవా జగదేక వీరా


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: ఎస్. పి. శైలజ 


పల్లవి: 


ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. 

జై చిరంజీవా.. జగదేక వీరా.. 

జై చిరంజీవా జగదేక వీరా 

అసహాయ శూరా అంజని కుమారా 

జై చిరంజీవా జగదేక వీరా 

అసహాయ శూరా అంజని కుమారా 

దీవించ రావయ్య వాయు సంచారా 

రక్షించవేలయ్య శ్రీరామ దూత 

జై చిరంజీవా.. 


చరణం 1: 


వీరాంజనేయా శూరాంజనేయ 

ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా 

జై చిరంజీవా.. 

ఆరోగ్యదాతా అభయ ప్రదాతా..ఆ... 

ఆరోగ్యదాతా అభయ ప్రదాతా 

ఉన్మాద భయ జాడ్య పీడా నివారా 

సంజీవి గిరివాహా.. సానీరిసాహ 

సంజీవి గిరివాహ సానీరిసాహొ 

జై చిరంజీవా.. జగదేక వీరా.. 


జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా 

జై చిరంజీవా జగదేక వీరా


- పాటల ధనుస్సు 


13, డిసెంబర్ 2025, శనివారం

ధినక్కుతా కసక్కురో | Dhinakkuta Kasakkuro | Song Lyrics | Jagadeka Veerudu Atiloka Sundari (1990)

ధినక్కుతా కసక్కురో



చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా ఢమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో


చరణం 1:


కసక్కు లయలు హొయలు చూశా

కసెక్కి వలపు వలలే వేశా

గుబుక్కు ఎదలో కథలే దాచా

గుటుక్కు మనక గుబులే దోచా

మజా చేస్తే మరోటంట 

మరోటిస్తే మగాణ్ణంట

సరే అంటే అతుక్కుంటా 

సరాగంలో ఇరుక్కుంటా

చుంబురుణ్ణై.. నారదుణ్ణై..

చుంబ మీద పంబ రేపి 

పాడుతుంటే మీరు గోవిందే

గోవిందా గోవింద 

come on.. come on పాడండయ్యా

పబం పప్పా పబం పప్పా 

పబం పప్పా పబం పప్పా

పబం పం పాబం పపం పం పాబం 

పబం పం పాబా పాబా బాబాబం


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో


చరణం 2:


వయస్సు ఒడిలో చొడినే చూశా

వరించి సుడిలో పడవే వేశా

నటించే నరుడా ఘనుడా మెచ్చా

నమస్తే నడుమే నటిగా ఇచ్చా

ఉడాయిస్తే ఉడుక్కుంటా 

లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా

సఖి అంటే సరే అంటా 

చెలి అంటే గురు అంటా

బ్రేకు డ్యాన్సు.. షేకు డ్యాన్సు..

mix చేసి steps వేసి tricks చేస్తే 

మీరు గోవింద

come on..come on dance I say 

ఆడండ్రా

ధినక్కుతా ధినక్కుతా 

ధినక్కుతా ధినక్కుతా

ధినక్కు తార ధినక్కు తార 

ధినక్కు తారా తారా తారారా


ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురో

తళుక్కు తార మిణుక్కు స్టారా 

కథక్కు ఆట పాట చూస్తారా

ధినక్కుతా కసక్కురో 

ఝనక్కుతా చమక్కురోయ్


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు