RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఏప్రిల్ 2026, సోమవారం

సరసాలు చాలు శ్రీవారు | Sarasalu Chalu Srivaru | Song Lyrics | Shiva (1989)

సరసాలు చాలు శ్రీవారు


చిత్రం : శివ (1989)

సంగీతం : ఇళయరాజా

రచన : సిరివెన్నెల 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి  


పల్లవి :


సరసాలు చాలు శ్రీవారు.. 

వేళ కాదు

విరహాల గోల ఇంకానా.. 

వీలు కాదు

సరసాలు చాలు శ్రీవారు.. 

వేళ కాదు

విరహాల గోల ఇంకానా.. 

వీలు కాదు

వంటిట్లో గారాలు.. 

ఒళ్ళంతా కారాలే సారు


చురుకైన ఈడు ఒద్దన్నా 

ఊరుకోదు

విరజాజి పూలు వంటిట్లో 

వాడరాదు


చరణం 1 :


సూర్యుడే చుర చుర చూసినా.. 

చీరనే వదలరు.. చీకటే చెరిగినా

కాకులే కేకలు వేసినా.. 

కౌగిలే వదలను.. 

వాకిలే పిలిచినా


స్నానానికే సాయమే 

రావాలనే తగువా

నీ చూపులే సోపుగా 

కావాలనే సరదా

పాపిడి తీసి.. పౌడరు పూసి 

బైటికే పంపేయనా

పైటతో పాటే లోనికిరానా.. 

పాపలా పారాడనా

తియ్యగా తిడుతూనే.. 

లాలించనా


సరసాలు చాలు శ్రీవారు.. 

తాన నాన

విరహాల గోల ఇంకానా.. 

ఊహు ఊహు


చరణం 2 :


కొత్తగా కుదిరిన వేడుక.. 

మత్తుగా పెదవుల నీడకే చేరదా

ఎందుకో తికమక తొందర.. 

బొత్తిగా కుదురుగా 

ఉండనే ఉండదా


ఆరారగా చేరక 

తీరేదెలా గొడవ

ఆరాటమే ఆగదా 

సాయంత్రమే పడదా

మోహమే తీరే మూర్తమే రాదా 

మోజులే చెల్లించవా

జాబిలే రాడా జాజులే తేడా 

రాతిరే రాదా ఇక

ఆగదే అందాక ఈడు గోల


చురుకైన ఈడు ఒద్దన్నా 

ఊరుకోదు

విరజాజి పూలు వంటిట్లో 

వాడరాదు

ఊరించే దూరాలు.. 

ఊ అంటే తియ్యంగా తీరు

సరసాలు చాలు శ్రీవారు 

వేళ కాదు

లలలలలా.. 

అహహహహహా.

హ్హాహాహహాహహహా


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చిగురులు వేసిన కలలన్ని | Chigurulu Vesina Kalalanni | Song Lyrics | Poola Rangadu (1967)

చిగురులు వేసిన కలలన్ని  చిత్రం : పూల రంగడు (1967) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : కె. బి. మోహన్ రాజు, పి.సుశీల  ప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు