RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఏప్రిల్ 2026, మంగళవారం

జీవితం ఏమిటి వెలుతురూ చీకటి | Jeevitham Emiti | Song Lyrics | Devadas (1974)

జీవితం ఏమిటి వెలుతురూ చీకటి


చిత్రం :  దేవదాసు (1974)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి : 


జీవితం... ఏమిటి?

వెలుతురూ... చీకటి..  అంతే

జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి అంతే

వెలుతురంతా చీకటైతే...  

అందులోనే సుఖము ఉన్నది

అవును.. జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి 


చరణం 1 :


మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ

తునక తునకలో... నరకమున్నది

మనసు విరిగి తునకలైతే.. ఏ.... ఏ

తునక తునకలో... నరకమున్నది 


లేదు లేదనుకున్న శాంతి 

చేదులోనే ఉన్నది

ఈ చేదులోనే ఉన్నది... 

హా... హా... హా... 


జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి


చరణం 2 :


రామచిలక ఎగిరిపోతే... 

రాగబంధం సడలిపోతే

రామచిలక ఎగిరిపోతే... 

రాగబంధం సడలిపోతే 


మూగ హృదయం... 

గాయమైనది

ఆ గాయమే ఒక గేయమైనది...

ఆ గాయమే ఒక గేయమైనది...  


జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి అంతే

వెలుతురంతా చీకటైతే... 

అందులోనే సుఖము ఉన్నది

 జీవితం ఏమిటి...  

వెలుతురూ చీకటి

వెలుతురూ....  చీకటి

వెలుతురూ....  చీకటి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చిగురులు వేసిన కలలన్ని | Chigurulu Vesina Kalalanni | Song Lyrics | Poola Rangadu (1967)

చిగురులు వేసిన కలలన్ని  చిత్రం : పూల రంగడు (1967) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : కె. బి. మోహన్ రాజు, పి.సుశీల  ప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు