RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, ఏప్రిల్ 2026, ఆదివారం

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ | Jabilli Chusenu Ninnu Nannu | Song Lyrics | Mahakavi Kshetrayya (1976)

జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ


చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : రామకృష్ణ, పి.సుశీల


పల్లవి:


జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. 

ఓయమ్మో

నాకెంత సిగ్గాయె బావా.. బావా.. 

నను వీడలేవా


పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. 

ఓయబ్బో

నీకింత సిగ్గేల బాలా.. 

రావా నను చేరరావా


చరణం 1:


ఆ .. ఆ.. ఆ .. ఆ..

ఆకాశమార్గాన అందాల మేఘాలు... 

పెనవేసుకున్నాయి చూడూ

చిగురాకు సరదాలు.. 

చిరుగాలి సరసాలు.. 

గిలిగింతలాయేను నేడూ


అందచందాలతో .. 

ప్రేమ బంధాలతో ..

జీవితం హాయిగా సాగనీ ..ఈ..ఈ..

బాలా...  రావా... నను చేరరావా..


చరణం 2:


ఆ .. ఆ .. ఆ .. ఆ కొమ్మపై ఉన్న 

అందాల చిలకలు.. 

అనురాగ గీతాలు పాడేనూ...

సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద.. 

మైమరచి కలలందు కరిగేనూ...


ముద్దు మురిపాలతో .. 

భావరాగాలతో ..

యవ్వనం పువ్వులా 

నవ్వనీ..ఈ..ఈ..

బావా... బావా.. నను వీడలేవా...


చరణం 3:


ఆ .. ఆ ..

బంగారు చెక్కిళ్ళ 

పొంగారు పరువాలు.. 

కొనగోటి మీటులే కోరేనూ

నీ లేత అధరాలు 

ఎంతెంతొ మధురాలు .. 

ఈ నాడు నా సొంతమాయేనూ


దేవి దీవించెను .. 

స్వామి వరమిచ్చెను ..

ఇద్దరం ఏకమౌదాములే ..ఏ..ఏ..

బాలా.. రావా ..నను చేరరావా


జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ .. 

ఓయబ్బో..

నాకెంత సిగ్గాయె బావా.. బావా ..

నను వీడలేవా


పొదరిల్లు పిలిచేను నిన్నూ నన్నూ .. 

ఓయమ్మో..

నీకింత సిగ్గేల బాలా.. రావా.. 

నను చేరరావా


ఆ..అహా...హ...

ఆ..ఆ...ఆ..ఆహా...

ఆ..అహ...హ..

ఆ...ఆ..ఆ..ఆ..అహా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వేచ్ఛ కోసం ఉద్యమించిన | స్వాతంత్ర్యదినోత్సవ పాట | Swechakosam | Song Lyrics | RK Duvvu | RKSS Creations

స్వాతంత్ర్యదినోత్సవ పాట  స్వేచ్ఛ కోసం ఉద్యమించిన రచన : రామకృష్ణ దువ్వు  Production : RKSS Creations... సాకి:   స్వేచ్ఛ కోసం ఉద్యమించిన...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు