RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

9, ఏప్రిల్ 2026, గురువారం

చందమామ రావే జాబిల్లి రావే | Chandamama Rave | Song Lyrics | Balipeetam (1975)

చందమామ రావే జాబిల్లి రావే 


చిత్రం : బలిపీఠం (1975)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల


పల్లవి :


చందమామ రావే జాబిల్లి రావే

అమ్మాయి అలిగింది.. 

అలక తీర్చిపోవే 

అలక తీర్చిపోవే


చందమామ రావే.. జాబిల్లి రావే

అబ్బాయి నోటికి.. 

తాళమేసి పోవే.. 

తాళమేసి పోవే

చందమామ రావే  


చరణం 1 :


చల్ల గాలి ఝడిపిస్తోంది.. 

ఎలాగా ?

గళ్ళ దుప్పటి కప్పుకోండి.. 

ఇలాగా..

పండు వెన్నెల రమ్మంటో౦ది.. 

ఎలాగా?

తలుపు తీశా వెళ్లిరండి.. 

ఇలాగా..


అందాల ఈ రేయీ 

వెళతాను అంటో౦ది

ఇద్దరిని ఒక్కటిగ 

చూడాలి అంటో౦ది

ఏదో వంకతో ఎందుకు పిలవాలి? .. 

కావాలంటే సూటిగానే అడగలేరా

చందమామ రావే.. 


చరణం 2 :


అమ్మాయి పుడితేను.. 

ఎలాగా?

పెళ్లి చేసి పంపాలి.. 

ఇలాగా

అబ్బాయి పుడితేను.. 

ఎలాగా?

గొప్పవాణ్ణి చెయ్యాలి.. 

ఇలాగా


అమ్మాయి పుట్టినా.. 

అబ్బాయి పుట్ట్టినా

మీలాగే ఉండాలి.. 

మీ మనసే రావాలి 


తల్లే పాలతో మంచిని పోయాలి

ఆ మంచితోనే వారు 

మనకు పేరు తేవాలి


చందమామ రావే.. జాబిల్లి రావే

పాపాయి పుడితేను..  

జోల పాడరావే..

జోల పాడరావే.. 

చందమామ రావే


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చందమామ రావే జాబిల్లి రావే | Chandamama Rave | Song Lyrics | Balipeetam (1975)

చందమామ రావే జాబిల్లి రావే  చిత్రం : బలిపీఠం (1975) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల పల్లవి : చందమామ రావే జ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు