RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, ఏప్రిల్ 2026, ఆదివారం

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో | Ravi Varmake Andani | Song Lyrics | Ravanude Ramudaithe (1979)

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో


చిత్రం : రావణుడే రాముడైతే (1979)

సంగీతం : జి.కె. వెంకటేశ్

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి


పల్లవి:

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

రవివర్మకే అందని 

ఒకే ఒక అందానివో

ఆ..ఆ... ఆ

రవివర్మకే అందని 

ఒకే ఒక అందానివో.. ఆ .. ఆ.. ఆ..

రవి చూడని.. పాడని.. 

నవ్యనాదానివో...

రవివర్మకే... ఆ .. ఆ..   

అందని... ఆ .. ఆ..  

ఒకే ఒక అందానివో... 


చరణం 1:


ఏ రాగమో.. తీగదాటి 

ఒంటిగా నిలిచే

ఏ యోగమో.. నన్ను దాటి 

జంటగా పిలిచే

ఏ మూగభావాలో.. 

అనురాగ యోగాలై....

ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ

నీ పాటలే పాడనీ..

రవివర్మకే... ఆ .. ఆ.. ఆ..  

అందని... ఆ .. ఆ.. ఆ..  

ఒకే ఒక అందానివో... 


చరణం 2:


ఏ గగనమో కురుల జారి.. 

నీలిమై పోయే

ఏ ఉదయమో నుదుట చేరి.. 

కుంకుమై పోయే

ఆ కావ్య కల్పనలే.. 

నీ దివ్య శిల్పాలై

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...

కదలాడనీ.. పాడనీ..


రవివర్మకే...  అందని.. 

ఒకే ఒక అందానివో...

ఆ .. ఆ.. ఆ....

రవి చూడని.. పాడని.. 

నవ్యనాదానివో...

రవివర్మకే.. ఆ.. ఆ... 

అందని.. ఆ.. ఆ...

ఒకే ఒక అందానివో...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు