RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, ఏప్రిల్ 2026, ఆదివారం

కలువకు చంద్రుడు ఎంతో దూరం | Kaluvaku Chandrudu Entho Dooram | Song Lyrics | Chillara Devullu (1975)

కలువకు చంద్రుడు ఎంతో దూరం


చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి. మహదేవన్

నేపధ్య గానం : ఎస్ పి బాలు


పల్లవి :


కలువకు చంద్రుడు ఎంతో దూరం

కమలానికి సూర్యుడు మరీ దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


దూరమైన కొలదీ పెరుగును అనురాగం

దూరమైన కొలదీ పెరుగును అనురాగం 

విరహంలోనే వున్నది అనుబంధం


కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 1:


నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ 

నవ్వే అదృష్టం ఎందరికుంటుంది

ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ 

అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 2:


వలపు కన్నా తలపే తీయనా

కలయక కన్నా కలలే తీయనా

చూపులకన్నా ఎదురు చూపులే తీయనా

నేటికన్న రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 3:


మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ

వలపా మనసుకు అందానిస్తుంది

ఈ రెండూ లేక జీవితమేముంది

ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి | Chupullo Chuttesi | Song Lyrics | Oorikichina Mata (1981)

చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి  చిత్రం  : ఊరికి ఇచ్చిన మాట (1981) సంగీతం  : ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత  : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం  ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు