RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chillara devullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chillara devullu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఏప్రిల్ 2026, ఆదివారం

కలువకు చంద్రుడు ఎంతో దూరం | Kaluvaku Chandrudu Entho Dooram | Song Lyrics | Chillara Devullu (1975)

కలువకు చంద్రుడు ఎంతో దూరం


చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి. మహదేవన్

నేపధ్య గానం : ఎస్ పి బాలు


పల్లవి :


కలువకు చంద్రుడు ఎంతో దూరం

కమలానికి సూర్యుడు మరీ దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


దూరమైన కొలదీ పెరుగును అనురాగం

దూరమైన కొలదీ పెరుగును అనురాగం 

విరహంలోనే వున్నది అనుబంధం


కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 1:


నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ 

నవ్వే అదృష్టం ఎందరికుంటుంది

ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ 

అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 2:


వలపు కన్నా తలపే తీయనా

కలయక కన్నా కలలే తీయనా

చూపులకన్నా ఎదురు చూపులే తీయనా

నేటికన్న రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం 

కమలానికి సూర్యుడు మరీ దూరం


చరణం 3:


మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ

వలపా మనసుకు అందానిస్తుంది

ఈ రెండూ లేక జీవితమేముంది

ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది


- పాటల ధనుస్సు 


18, జనవరి 2022, మంగళవారం

పాడాలనే ఉన్నది | Padalane vunnadi | Song Lyrics | Chillara Devullu (1975)

పాడాలనే ఉన్నది


చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


పల్లవి:

ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
పాడాలనే ఉన్నది.. 
విని మెచ్చి.. మనసిచ్చే 
మనిషుంటే..
పాడాలనే ఉన్నది.. 
విని మెచ్చి.. మనసిచ్చే 
మనిషుంటే...ఏ..ఏ..
పాడాలనే ఉన్నది..

చరణం 1:

పాడాలంటే 
హృదయం ఉండాలి
పాడాలంటే 
హృదయం ఉండాలి
హృదయానికి ఏదో ఒక 
కదలిక రావాలి

భావం పొంగాలి.. 
రాగం పలకాలి.. 
దానికి జీవం పోయాలి

భావం పొంగాలి.. 
రాగం పలకాలి.. 
దానికి జీవం పోయాలి..
ఈ..ఇ..ఇ....

పాడాలనే ఉన్నది.. 
విని మెచ్చి.. మనసిచ్చే 
మనిషుంటే...
పాడాలనే ఉన్నది..

చరణం 2:

పాడానంటే రాళ్ళే కరగాలి..
ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి 
కథలే చెప్పాలి..
పాడానంటే రాళ్ళే కరగాలి..
ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి 
కథలే చెప్పాలి..

ముసుగులు తొలగాలి.. 
మసకలు పోవాలి.. 
గదిలో దేవత కను తెరవాలి

పాడాలని ఉన్నది..


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు