RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, జనవరి 2026, సోమవారం

ఏనాడు విడిపోని ముడి వేసెనే | Yenadu Vidiponi | Song Lyrics | Sri Kanakamahalakshmi Recording Dance Troop (1988)

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చిత్రం : శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)

రచన :  వేటూరి సుందరరామమూర్తి  

సంగీతం : ఇళయరాజా  

గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

ఈ మధుర యామినిని


ఏ జన్మ స్వప్నాల అనురాగమో

ఏ జన్మ స్వప్నాల అనురాగమో

పూసినది నేడు ఈ పసుపు తాడు

పూసినది నేడు ఈ పసుపు తాడు

ఈ సుచల ఆమనిని


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చరణం 1:


మోహాన పారాడు వేలి కొనలో

నీ మేను కాదా చైత్ర వీణ

వేవేల స్వప్నాల వేడుకలలో

నీ చూపు కాదా పూల వాన

రాగసుధ పారే అలల శృతిలో

స్వాగతము పాడే ప్రణయము

కలకాలము కలగానమై

నిలవాలి మన కోసము ఈ మమత


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


చరణం 2: 


నీ మోవి మౌనాన మదన రాగం

మోహాన సాగే మదుప గానం

ఏ మోవి పూసింది చైత్ర మోదం

చిగురాకు తీసే వేణు నాదం

పాపలుగ వెలిసే పసిడి కలకు

ఊయలను వేసే క్షణమిదే

రేపన్నది ఈ పూటనే

చేరింది మన జంటకు ముచ్చటగ


ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు

పూసినది నేడు ఈ పసుపు తాడు

ఈ మధుర యామినిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే

ఏనాడు విడిపోని ముడి వేసెనే


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు