RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జనవరి 2026, గురువారం

శ్యామ సుందరా ప్రేమ మందిరా | Shyama Sundara | Song Lyrics | Bhakta Tukaram (1973)

శ్యామ సుందరా ప్రేమ మందిరా


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : రామకృష్ణ


పల్లవి:


శ్యామ సుందరా ప్రేమ మందిరా

నీ నామమే వీనుల విందురా

నీ నామమే వీనుల విందురా..

శ్యామసుందరా ...


చరణం 1:


అణువణువు నీ ఆలయమేరా.. 

నీవే లేని చోటు లేదురా

అణువణువు నీ ఆలయమేరా 

నీవే లేని చోటు లేదురా

నీవని నేనని లేనే లేదూ...  

నీకు నాకు బేధమే లేదు


శ్యామ సుందరా...  ప్రేమ మందిరా


సుఖ దుఖాలకు నిలయం దేహం 

ఈ దేహము పై ఎందుకు మోహం

అహము విడిచితే ఆనందమురా 

అన్నిట మిన్నా అనురాగమురా

భక్త తుకారాం బోధలు వింటే 

తొలిగిపోవును శోకమురా


శ్యామ సుందరా...  ప్రేమ మందిరా


చరణం 2:


సాధన చేయుమురా నరుడా 

సాధ్యము కానిది లేదురా 

సాధన చేయుమురా నరుడా 

సాధ్యము కానిది లేదురా 

అలవాటైతే విషమే అయినా 

హాయిగా తాగుట సాధ్యమురా..

హాయిగ తాగుట సాధ్యమురా

సాధన చేయుమురా నరుడా 

సాధ్యము కానిది లేదురా


కాల సర్పమును మెడలో దాల్చి 

పూల మాలగా తలచ వచ్చురా...

పూల మాలగా తలచ వచ్చురా

ఏకాగ్రతతో ధ్యానము చేసి 

లోకేశ్వరునే చేరవచ్చురా..

లోకేశ్వరునే చేరవచ్చురా... 


దాస తుకారాం తత్వ బోధతో 

తరించి ముక్తిని పొందుమురా..

తరించి ముక్తిని పొందుమురా... 


సాధన చేయుమురా నరుడా 

సాధ్యము కానిది లేదురా


చరణం 3:


అణిగిమణిగి ఉండేవారే 

అందరిలోకి ఘనులు.. 

హొహోయ్

అణిగిమణిగి ఉండేవారే 

అందరిలోకి ఘనులు... 

దొడ్డమానులను కూల్చు తుఫాను 

గడ్డి పరకను కదల్చగలదా.. 

కదల్చగలదా

చిన్న చీమలకు చక్కెర దొరుకును.. 

గొప్ప మనిషికి ఉప్పే కరువు.. 

ఉప్పే కరువు

అణకువ కోరే తుకారాము 

నీ మనసే దేవుని మందిరము.. 

మనసే దేవుని మందిరము

హోయ్... అణిగిమణిగి ఉండేవారే 

అందరిలోకి ఘనులు.. హొహోయ్

అణిగిమణిగి ఉండేవారే 

అందరిలోకి ఘనులు...


హైలెస్సా హైలెస్సా హైలెస్సా

హైలెస్సా హైలెస్సా హైలెస్సా


పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...

పడవెళ్ళొపోతుందిరా 

ఓ మానవుడా దరి చేరే దారేదిరా

ఈ జీవితము కెరటాల పాలాయెరా


పడవెళ్ళిపోతోందిరా..

హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

తల్లిదండ్రి అతడే 

నీ ఇల్లు వాకిలతడే

తల్లిదండ్రి అతడే 

నీ ఇల్లు వాకిలతడే

ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ... 

నీ మనసు గోడు వింటాడురా

నీ భారమతడే మోసేనురా 

ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..

పడవెళ్ళిపోతోందిరా.....


బుడగవంటి బ్రతుకు 

ఒక చిటికెలోన చితుకు

బుడగవంటి బ్రతుకు 

ఒక చిటికెలోన చితుకు

ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...

నీవెందుకని మురిసేవురా..

నువు దరిచేరే దారి వెతకరా 

ఓ మానవుడా.. 

హరినామం మరువవొద్దురా..

పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ......


హైలెస్సా హైలెస్సా హైలెస్సా

హైలెస్సా హైలెస్సా హైలెస్సా

హైలెస్సా హైలెస్సా హైలెస్సా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు