RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జనవరి 2026, ఆదివారం

సాగే నది కోసం సాగర సంగీతం | Sage Nadikosam | Song Lyrics | Kayyala Ammayi Kalavari Abbayi (1982)

సాగే నది కోసం సాగర సంగీతం


చిత్రం : కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి (1982)

సాహిత్యం : వేటూరి

సంగీతం : కృష్ణ చక్ర

గానం : బాలు, సుశీల


పల్లవి :


సాగే నది కోసం సాగర సంగీతం

కలిసే నది కోసం కడలే నీ గీతం

సిరివెన్నెలమ్మ కోనలోన వెన్నెల

చిరునవ్వులమ్మ కూతురైన కన్నెలా


చరణం 1:


ఏదలో ఆరటాలే..

పడిలేచే కెరటాలై

కలిశే బులపాటలే..

తొలి మోమాటలై

సాగరాల ఘోషలే విని 

సాగే వాగు వంక

చిలుక గోరువంక 

గూడుకట్టే గుండెలోన

జల్లుమనే మది పల్లవిగా 

మనమల్లుకోనే ఈ వేళ

కొత్త కద్దరంచు చీర 

నేను కట్టగా

తొలి అద్దకాల ముద్దు 

నేను పెట్టగా


చరణం 2:


వచ్చే వలపు వసంతం..

నులి వెచ్చని తేనెలతో

మెరిసే శ్రావణ మేఘం..

తనివి తీరని దాహంతో

కన్నెవలపు కోడిపులుపు 

కలిసే కౌగిలింత

అలకే తీరి పులకే 

పూత కొచ్చే వేళలోన

ఆ గతమే నా స్వాగతమై..

ఈ జీవితమే నీదైతే

తొలి తూరుపింటి 

లేత ఎండ బొట్టుగా

చుక్క దీపమెట్టు వేళ 

ముద్దు పెట్టగా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు