RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, జనవరి 2026, ఆదివారం

శివరంజని నవరాగిణి | Shivaranjani Navaragini | Song Lyrics | Toorpu Padamara (1976)

శివరంజని నవరాగిణి


చిత్రం: తూర్పు పడమర (1976)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు


పల్లవి :


శివరంజని నవరాగిణి

వినినంతనే నా తనువులోని

అణువణువు కరిగించే 

అమృతవాహిని


ఆ ఆ ఆ 

శివరంజని నవరాగిణి 

ఆ ఆ ఆ ఆ


చరణం 1:


రాగాల సిగలోన సిరిమల్లివి... 

సంగీత గగనాన జాబిల్లివి 

రాగాల సిగలోన సిరిమల్లివి... 

సంగీత గగనాన జాబిల్లివి 


స్వర సుర ఝురీ తరంగానివి

స్వర సుర ఝురీ తరంగానివి

సరస హృదయ వీణా వాణివి


శివరంజని నవరాగిణి 

ఆ ఆ ఆ ఆ


చరణం 2 :


ఆ కనులు పండు వెన్నెల గనులు... 

ఆ కురులు ఇంద్రనీలాల వనులు 

ఆ కనులు పండు వెన్నెల గనులు... 

ఆ కురులు ఇంద్రనీలాల వనులు


ఆ వదనం అరుణోదయ కమలం

ఆ అధరం సుమధుర మధుకలశం

శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ


చరణం 3:


జనకుని కొలువున అల్లనసాగే 

జగన్మోహిని జానకి

వేణుధరుని రధమారోహించిన 

విధుషీమణి రుక్మిణి

రాశీకృత నవరసమయ 

జీవన రాగచంద్రికా

లలిత లావణ్య భయద 

సౌందర్య కలిత చండికా


రావే రావే నా శివరంజనీ 

మనోరంజనీ

రంజనీ…  నా రంజనీ

నీవే నీవే నాలో పలికే నాదానివీ

నీవే నా దానివీ

నాదానివి... నీవే నాదానివీ


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు