సరిసరీ వగలు తెలిసెర
చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం : పి.సుశీల
పల్లవి :
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ....
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...
చెంతకు రమ్మన చేరనంటినా...
చెక్కిలినొక్కిన కూడదంటినా...
తొలిఝామైనా కానిదే...
తొలిఝామైనా కానిదే...
తొందర ఎందుకు ఎందుకంటిరా...
సరిసరీ....
చరణం : 1
ఆ... మంచి గంధం పూయకముందే..
మల్లెమొగ్గలు చల్లకముందే
మంచి గంధం పూయకముందే..
మల్లెమొగ్గలు చల్లకముందే...
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే....
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ... ఆ... ఆ...
కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల
చాలించవేరా...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ....
చరణం : 2
ఆ... పండువెన్నెల పానుపు చేసి...
పైట కొంగున వీవన వీచీ...
వేడిముద్దులు కానుక చేసి..
విడని కౌగిట బందీచేసి..
ఎన్నడెరుగని.. వన్నెతరుగని
కన్నెవలపులు అందించి...
అందాలు చిందింతులేరా...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ....
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి