RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, జనవరి 2026, గురువారం

తూర్పూ పడమర ఎదురెదురూ | Toorpu Padamara Edureduru | Song Lyrics | Toorpu Padamara (1976)

తూర్పూ పడమర ఎదురెదురూ


చిత్రం :  తూర్పు పడమర (1976)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం :  సుశీల, కోవెల శాంత


పల్లవి :


తూర్పూ పడమర ఎదురెదురూ..

నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. 

తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ?.. 

ఈ సృష్టికి  మొదలేదీ? 


తూర్పూ పడమర ఎదురెదురూ.. 

నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. 

తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ . . 

ఈ సృష్టికి మొదలేదీ


చరణం 1 :


తూర్పున ఉదయించే సూర్యుడు.. 

పడమట నిదురించునూ

పడమట నిదురించే సూర్యుడే.. 

తూర్పున ఉదయించునూ

ఆ తూర్పు పడమరకేమౌనూ.. 

ఈ పడమర తూర్పునకేమౌనూ 

ఈ ప్రశ్నకి బదులేదీ?..  

ఈ సృష్టికి మొదలేదీ


తూర్పూ పడమర ఎదురెదురూ.. 

నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. 

తెలిసి ఆరాటం దేనికనీ


ఈ ప్రశ్నకి బదులేదీ.. 

ఈ సృష్టికి మొదలేదీ


చరణం 2 :


నింగిని సాగే నీలి మేఘం 

నేల వడిలో వర్షించునూ

నేలను కురిసే ఆ నీరే 

నింగిలో మేఘమై పయనించునూ

ఆ నింగికి నేల ఏమౌనూ? 

ఈ నేలకు నింగి ఏమౌనూ 


ఈ ప్రశ్నకి బదులేదీ? 

ఈ సృష్టికి మొదలేదీ?

తూర్పూ పడమర ఎదురెదురూ.. 

నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. 

తెలిసి ఆరాటం దేనికనీ


ఈ ప్రశ్నకి బదులేదీ.. 

ఈ సృష్టికి మొదలేదీ


చరణం 3 :


వేయని నాటకరంగం పైనా 

రాయని నాటకమాడుతున్నానూ

సూత్రధారికి పాత్రధారులకు 

తేడా తెలియక తిరుగుతున్నామూ

నాటకమే ఒక జీవితమా? 

జీవితమే ఒక నాటకమా

ఈ ప్రశ్నకు... ఈ ప్రశ్నకు..


జీవితమే ఒక నాటకమైతే... 

నాటకమే ఒక జీవితమైతే

పాత్రలు ఎక్కడ తిరిగినా.. 

సూత్రధారి ఎటు తిప్పినా

కథ ముగిసేలోగా కలవకుందునా.. 

ఆ సూత్రధారి తానే కలపకుండునా


విన్నావా ఇది విన్నావా... 

సూర్యుడా.. ఉదయ సూర్యుడా...

పడమటి దిక్కున ఉదయించాలని 

బ్రాంతి ఎందుకో?

సృష్టికే ప్రతి సృష్టి చేయు 

నీ దృష్టి మానుకో 


నిన్ను ఆశగా చూసే కనులకు..

కన్నీరే మిగిలించకూ...  

ఇంకా ఇంకా రగిలించకూ

చంద్రుని చలువలు పంచుకో.. 

నిన్నటి ఆశలు తెంచుకో


తూర్పూ పడమర ఎదురెదురూ.. 

నింగీ నేలా ఎదురెదురూ


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు