RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, జనవరి 2026, శనివారం

కలయైనా నిజమైనా | Kalayaina Nijamaina | Song Lyrics | Prema Tarangalu (1980)

కలయైనా నిజమైనా

 


చిత్రం : ప్రేమ తరంగాలు (1980)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం : ఎస్ పి బాలు, పి సుశీల


పల్లవి :


కలయైనా నిజమైనా... 

కాదన్నా లేదన్నా

చెబుతున్నా ప్రియతమా

నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


కలయైనా నిజమైనా... 

కాదన్నా లేదన్నా

చెబుతున్నా ప్రియతమా

నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం 1  : 


నిన్ను పూజించనా... 

నిన్ను సేవించనా

సర్వమర్పించనా...  

నిన్ను మెప్పించనా

నీ గుడిలో దీపముగా 

నా బతుకే వెలిగించి 

ఒడిగట్టి నేనారిపోనా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం 2 :


నిన్ను లాలించనా... 

నిన్ను పాలించనా

జగతి మరపించనా... 

స్వర్గమనిపించనా

నా యెదలో దేవతగా 

నీ రూపే నిలుపుకొని

నీ ప్రేమ పూజారి కానా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


చరణం 3 :


కలిసి జీవించినా... 

కలలు పండించినా

వలచి విలపించినా... 

కడకు మరణించినా

నీ జతలో జరగాలి 

నీ కథలో నాయికగా

మిగలాలి మరుజన్మకైనా


నువ్వంటే నాకు ప్రేమ

నువ్వంటే నాకు ప్రేమ


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు