స్వరములు ఏడైనా రాగాలెన్నో
చిత్రం: తూర్పు పడమర (1976)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: పి.సుశీల
పల్లవి:
స్వరములు ఏడైనా..
రాగాలెన్నో
హృదయం ఒక్కటైనా...
భావాలెన్నో
అడుగులు రెండైనా
నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా
కావ్యాలు ఎన్నెన్నో
చరణం 1:
జననంలోన కలదు వేదన ..
మరణంలోనూ కలదు వేదనా
జననంలోన కలదు వేదన ..
మరణంలోనూ కలదు వేదనా
ఆ వేదనలోన ఉదయించే
నవవేదాలెన్నో నాదాలెన్నెన్నో ..
నాదాలెన్నెన్నో
చరణం 2:
నేటికి రేపొక తీరని ప్రశ్న ..
రేపటికి మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ ఆ ..ఆ
కాలమనే గాలానికి చిక్కి
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో..
ఎన్నెన్నో
చరణం 3:
కనులున్నందుకు
కలలు తప్పవు ..
కలలున్నపుడు
పీడకలలు తప్పవు
కనులున్నందుకు
కలలు తప్పవు ..
కలలున్నపుడు
పీడకలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే ..
కలల వెలుగులో కన్నీరొలికే
కలత నీడలు ఎన్నెన్నో
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి