RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, జనవరి 2026, గురువారం

స్వాతి చినుకు సందెవేళలో | Swathi Chinuku Sandevelalo | Song Lyrics | Akhari Poratam (1988)

స్వాతి చినుకు సందెవేళలో


చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో... 

హొయ్

మబ్బే కన్ను గీటే అరె 

మతే పైట దాటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే

భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

భలేగుంది పడుచు ముచ్చటా... హా

భలే కదా గాలి ఇచ్చటా...


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వలపు అందగాడిలో... 

హొయ్

ఈడే ఉరుముతుంటే... 

నేడే తరుముతుంటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా.. 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా

పదా అంది పడుచు పూపొదా..

హోయ్..

ఇదే కదా చిలిపి ఆపదా 


చరణం 1 :


ఈ గాలిలో ఒకే చలీ 

ఈ దెబ్బతో అదే బలి

ఈ తేమలో ఒకే గిలీ 

ఈ పట్టుతో సరే సరి


నీ తీగకే గాలాడక.. 

నా వీణలే అల్లాడగా

నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా

వరాలిచ్చి పోరా వరించాను లేరా

చల్లని జల్లుల సన్నని గిల్లుడు 

సాగిన వేళా.. కురిసిన


స్వాతి చినుకు సందెవేళలో.. 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో.. 

హొయ్


మబ్బే కన్ను గీటే మతే పైట దాటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా... 

హొయ్


ఇదే కదా చిలిపి ఆపదా

భలేగుంది పడుచు ముచ్చటా ...హా

భలే కదా గాలి ఇచ్చటా 


చరణం 2 :


యా యా యా యా యా యా....

ఈ వానలా కథేమిటో 

నా ఒంటిలో సొదెందుకో

నీకంటిలో కసేమిటో 

నాకంటినీ తడెందుకో

తొలివానలా గిలిగింతలో 

పెనవేసినా కవ్వింతలో

ఎదే మాట రాకా పెదాలందు ఆడా

శృతే మించిపోయి లయే రేగిపోగా

మబ్బుల చాటున ఎండలు 

సోకిన అల్లరి వేళా మెరిసిన


స్వాతి చినుకు సందెవేళలో 

హొయ్

లేలేత వలపు అందగాడిలో 

హొయ్


ఈడే ఉరుముతుంటే 

నేడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే


భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

పదా అంది పడుచు పూపొదా 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు