RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
akhari poratam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
akhari poratam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2026, గురువారం

స్వాతి చినుకు సందెవేళలో | Swathi Chinuku Sandevelalo | Song Lyrics | Akhari Poratam (1988)

స్వాతి చినుకు సందెవేళలో


చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి


పల్లవి :


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో... 

హొయ్

మబ్బే కన్ను గీటే అరె 

మతే పైట దాటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే

భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

భలేగుంది పడుచు ముచ్చటా... హా

భలే కదా గాలి ఇచ్చటా...


స్వాతి చినుకు సందెవేళలో... 

హొయ్

లేలేత వలపు అందగాడిలో... 

హొయ్

ఈడే ఉరుముతుంటే... 

నేడే తరుముతుంటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా.. 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా

పదా అంది పడుచు పూపొదా..

హోయ్..

ఇదే కదా చిలిపి ఆపదా 


చరణం 1 :


ఈ గాలిలో ఒకే చలీ 

ఈ దెబ్బతో అదే బలి

ఈ తేమలో ఒకే గిలీ 

ఈ పట్టుతో సరే సరి


నీ తీగకే గాలాడక.. 

నా వీణలే అల్లాడగా

నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా

వరాలిచ్చి పోరా వరించాను లేరా

చల్లని జల్లుల సన్నని గిల్లుడు 

సాగిన వేళా.. కురిసిన


స్వాతి చినుకు సందెవేళలో.. 

హొయ్

లేలేత వణుకు అందగత్తెలో.. 

హొయ్


మబ్బే కన్ను గీటే మతే పైట దాటే

సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే

పదా అంది పడుచు పూపొదా... 

హొయ్


ఇదే కదా చిలిపి ఆపదా

భలేగుంది పడుచు ముచ్చటా ...హా

భలే కదా గాలి ఇచ్చటా 


చరణం 2 :


యా యా యా యా యా యా....

ఈ వానలా కథేమిటో 

నా ఒంటిలో సొదెందుకో

నీకంటిలో కసేమిటో 

నాకంటినీ తడెందుకో

తొలివానలా గిలిగింతలో 

పెనవేసినా కవ్వింతలో

ఎదే మాట రాకా పెదాలందు ఆడా

శృతే మించిపోయి లయే రేగిపోగా

మబ్బుల చాటున ఎండలు 

సోకిన అల్లరి వేళా మెరిసిన


స్వాతి చినుకు సందెవేళలో 

హొయ్

లేలేత వలపు అందగాడిలో 

హొయ్


ఈడే ఉరుముతుంటే 

నేడే తరుముతుంటే

చలే కొరుకుతుంటే హొయ్ 

చెలే వణుకుతుంటే


భలేగుంది పడుచు ముచ్చటా హా

భలే కదా గాలి ఇచ్చటా

పదా అంది పడుచు పూపొదా 

హొయ్

ఇదే కదా చిలిపి ఆపదా


- పాటల ధనుస్సు 


ఎప్పుడు ఎప్పుడు | Eppudu Eppudu | Song Lyrics | Akhari Poratam (1988)

ఎప్పుడు ఎప్పుడు



చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : ఎస్ పి బాలు, చిత్ర 


పల్లవి :


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


చరణం 1 :


ఒక మాటు ఒడిని మీటి...  

ఒక మాటు ఒడిని మీటి... 

వలపు రాగాలు లాగేసుకుంటాలే 


పొద చాటు కథలు దాటి...  

పొద చాటు కథలు దాటి... 

చిలిపి తాళాలు మోగించుకుంటాలే  


ఎప్పటికప్పుడు దప్పిక 

తీరని చెప్పని దాహాలే

ఏమని చెప్పను నీకు 

జవాబులు పైటల పాప


అచ్చట ముచ్చట ఇచ్చట 

గిచ్చుడు పెంచిన మొహాలే

ఎంతని ఆపను నిన్ను 

మరీ మది బిత్తరపోక


చక్కని చుక్క తన సొంతం 

అనుకోమాక బలవంతం 

కోరికలే ఓపికలై మోజులు 

తెచ్చిన అల్లరిలో 


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


చరణం 2 :


పొరపాటో తెరకు చాటో...  

పొరపాటో తెరకు చాటో... 

వయసులాటాడుకోవాలి ఈనాడే 

అది ఆటో పెదవి గాటో...  

అది ఆటో పెదవి గాటో ... 

మధుర గాయాలు తాకాలి లోలోనే


చప్పున ఆరని నిప్పుల 

కుంపటి రేపిన తాపాలే

చల్లని వెన్నెల చిచ్చుల 

ఉచ్చులు వేసెను నాకే


అచ్చిక బుచ్చిక పిచ్చిగ 

మచ్చిక చేసిన అందాలే

జంటగ తుంటరి రెప్పల 

గంటలు కొట్టెను నేడే


చమ్మని చక్కే మన ఆట...  

మల్లెల పక్కే మన తోట

నవ్వులతో పువ్వులతో 

రివ్వులు పెట్టిన ప్రేమలలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే 

నా వంటికి పంపే

అల్లికలో అందికలో 

మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు 

ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో 

మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల 

కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో 

దక్కిన చెక్కిలిలో 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు