RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, మార్చి 2022, సోమవారం

ఓ నా రాజా రావా రావా | Oh Naa Raja | Song Lyrics | Ame Evaru (1966)

ఓ నా రాజా రావా రావా



చిత్రం: ఆమె ఎవరు (1966)

సంగీతం: వేద

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా రావా...చెలినే మరిచేవా..ఆ..ఆ..

ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా ....రావా


చరణం 1:


నీ రూపే ఆశ రేపేను ...

నీ మాటే వీణ మీటేను

ఓ......ఓ......ఓ....

నీ రూపే ఆశ రేపేను... 

నీ మాటే వీణ మీటేను

గతాలే నన్ను పిలిచాయి... 

ఆ హాయే నేడు లేదోయి..ఈ..ఈ..

కలగ కరిగిందంతా... 

జగమే యెంతో వింత...

రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...


ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా..... రావా


చరణం 2:


వృధాగ కాలమేగెను... 

నిరాశే పొంగివచ్చేను

ఓ......ఓ......ఓ.....

వృధాగ కాలమేగెను ...

నిరాశే పొంగి వచ్చేను...

తరంగంలాగ రావోయి.... 

ప్రియా నన్నాదుకోవోయి

యేదో తీరని బాధ.... 

కన్నీరొలికే గాధ...

రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...


ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా..... రావా


చరణం 3:


నీ కోసం నేనే వచ్చాను... 

నీ ఇంటికి దీపం అయినాను

నీ కోసం నేనే వచ్చను 

నీ ఇంటికి దీపం అయినను

నా తోని ఆడు కోవెల 

ఈ కోపం నేడు నీకేలా

నీ అడుగులలో నేను... 

నా కన్నులలో నీవు..

నాలో నీవు... నీలో నేనేలే..ఏ..ఏ...


ఓ నా రాజా... రావా రావా...

చెలినే మరిచేవా..ఆ..ఆ..

ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా ....రావా


వరించిన మంచి వధువులే..

రుచించే తీపి మధువునులే...

ప్రియా నీ ప్రేమ కథనోయి..

సదా నీ నీలినీడనులే...ఏ..

ఏనాటిదో అనుబంధం..

ఎన్నడు తెగదీ బంధం....


రేయి పగలు నిన్నే వెతికేనూ...ఊ..ఊ...


ఓ నా రాజా... రావా రావా...

ఓ నా రాజా... రావా..... రావా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు