అభినందన మందార మాల
చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : ఏసుదాస్, సుశీల
పల్లవి :
అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అధినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..
స్త్రీజాతికీ.. ఏనాటికీ..
స్మరణీయ మహనీయ వీరాగ్రణికి..
అభినందన మందారమాల..
అధినాయక స్వాగత వేళ..ఆ..
చరణం 1 :
వేయి వేణువులు నిన్నే పిలువగ..
నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ..
నీ పిలుపు నావైపు పయనించెనా
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..
నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..
నా గుండె పై నీవుండగా..
దివి తానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల..
అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..
సౌందర్యమూ సౌశీల్యమూ..
నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల..
చరణం 2 :
వెండి కొండపై వెలసిన దేవర..
నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర..
నెలవంక మెరిసింది నీ కరుణలో
సగము మేనిలో ఒదిగిన దేవత..
సగము మేనిలో ఒదిగిన దేవత..
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..
ప్రియ భావమే లయ రూపమై..
అలలెత్తి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల..
ఉభయాత్మల సంగమవేళ..ఆ..
అభినందన మందారమాల..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి