ఆ నవ్వుకు ఒక ఆమనీ
చిత్రం : ఇద్దరు దొంగలు (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..
ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ.. హా..
చరణం 1 :
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా
బదులైనా బతుకైనా..ముద్దుకు ముద్దే చెల్లంటా
వయసుకు వయసే వళ్ళంటా..
కన్ను తుదల.. ఎన్ని ఎదల తీపి సుధలు నీలో..
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..
చరణం 2 :
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
వీచే పెదాల చిలిపీ సిరాల.. చిరు సంతకాలతో
నా జీవితాలు చెలి కాగితాలు..నీకంకితాలు చేస్తాగా
కలలైనా.. నిజమైనా.. కౌగిలి పెట్టిన ఇల్లంటా
ఇద్దరి పేరే ప్రేమంటా..
ఎన్నిజతులు.. ప్రేమ జతలు.. పూలరుతులు నీలో..
తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో
తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..
ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
వెచ్చని ముద్దులుగా.. అవి అచ్చులు పడెనాలో
లలలల.. లా.. లల.. లాలలల.. లలలాలా..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి