నీ రూపే ఆలాపన మదిలోనే ఆరాధన
చిత్రం : పులి-బెబ్బులి (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి.. అమరజ్యోతి...
వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి.. అమరజ్యోతి...
వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
ఆరనిజ్యోతి.. అమరజ్యోతి...
వెలిగిన నా కోవెలలో
చరణం 1 :
వయసు విరులుగా విరిసే వసంతం
మనసున విరి తేనె కురిసే సుగంధమై
కలల అలలపై కదిలే ప్రయాణం
కౌగిట ముగిసేను కమ్మని బంధమై
మల్లెల పల్లకి వెన్నెల వాకిట...
మాపటి వేళకు వచ్చిన ముచ్చట
మల్లెల పల్లకి వెన్నెల వాకిట...
మాపటి వేళకు వచ్చిన ముచ్చట
పూచేపున్నాగ పూలా సన్నాయి...
పులకరింత పలకరించు వేళ
సౌందర్య రాగాలలో...
సాహిత్యభావాలలో
సుమించు సుఖాల ..
మిళుమిళు చీకటి చిలిపి
వెన్నెలల హారతే ఇవ్వగా
నీ రూపే... నీ రూపే
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి.. అమరజ్యోతి...
వెలిగిన నా కోవెలలో
చరణం 2 :
గిరులకు సిరినై.. విరులకు విరినై
చిరుచిరునవ్వుల శ్రీలక్ష్మి నేనై
సిరికే హరినై.. సుఖలాహిరినై
నీ పద గీతికి నేనే శృతినై
రిరిరీగాగా... వాణి నా రాణి
సారిసారిరి.. నిత్య కల్యాణి
పపద దదప ససగరిరిస
సుందరసుమధుర నాట్యములాడగ
ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిను వలచినా పెనవెసినా
ప్రణయములలో
మమతాస్వరాలు... మధురాక్షరాలు
మనసులు కలిపిన వలపుల పిలుపున
సాగే సంగీతమై
నీ రూపే... నీ రూపే
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
ఆరని జ్యోతి.. అమరజ్యోతి...
వెలిగిన నా కోవెలలో
నీ రూపే ఆలాపన...
మదిలోనే ఆరాధన
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి