RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, మార్చి 2022, ఆదివారం

ప్రేమ బృందావనం | Prema Brindavanam | Song Lyrics | Bangaru Kanuka (1982)

ప్రేమ బృందావనం



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం : ఆనంద్, సుశీల


పల్లవి :


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..

ఆ రాముడు నా వరుడిగా...  చేరగా..

ప్రేమ బృందావనం ...


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..

ఆ సీతే నా వధువుగా...  చేరగా

ప్రేమ బృందావనం.... 



చరణం 1 :



పెళ్ళికే పాల మబ్బు పందిరే వేసెనయ్యా..

పచ్చనీ తీగలన్ని తోరణం చేసెనయ్యా ...

తారలే తలంబ్రాలై కురిసేనయ్యా ...


నా...కన్నులా...కళ్యాణజ్యోతుల కాంతులు మెరిసే ...

ప్రేమ బ్రందావనం పలికెలే స్వాగతం...


చరణం 2 :


గాలికే నీ అందం...  కవితలే నేర్పెనమ్మా...

వీణకే నీ గానం...  స్వరములే తెలెపెనమ్మా..

చందమామ నీ ముందూ ఎందుకే బొమ్మా....


ఆ...అమ్మమ్మా.... అపురూప సుందర అప్సర నీవు...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...


చరణం 3 :


పాలలో తేనెవలే మనసులే కలిసెనయ్యా...

కలిపిన కొంగులు రెండూ విడిపోవమ్మా...

మా.. జంటనే ... దీవించగా.. గుడి గంటలు మ్రోగే..


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...

ఆ రాముడు నా వరుడిగా చేరగా..

ప్రేమ బృందావం...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు