RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
anr sujatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
anr sujatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2022, మంగళవారం

ఎవరు ఎవరో తెలియకుండా | Evaru Evaro Teliyakunda | Song Lyrics | Bahudoorapu Batasari (1983)

ఎవరు ఎవరో తెలియకుండా



చిత్రం :  బహుదూరపు బాటసారి (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఎవరు ఎవరో తెలియకుండా.. 

ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..

చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం

చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే...

చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే..

చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం


చరణం 1 :


కన్ను కన్ను కలిసినాక.. 

పిచ్చిపట్టి తిగురుతుంటే...

దాహం.. దాహం.. దాహం.. 

దాహం.. దాహం.. దాహం...

దిక్కులన్నీ పూలు పరచి పిల్లలల్లే ఎగిరిపడితే...

సరసం.. సరసం.. సరసం.. 

సరసం.. సరసం.. సరసం..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..


ఎదురు చూసి కనులు రెండూ.. 

తెల్లవారి ఎర్రబారితే...

విరహం... విరహం... విరహం... విరహం... 

విరహం... విరహం... విరహం...


చనువు పెరిగి అలకలేసి... 

అలిగి అలిగి పారిపోతే...

కలహం.. కలహం... కలహం.. 

కలహం.. కలహం.. కలహం..

లల్లలల్లలా.. 

ఆహహా... ఆహహా... ఓహో.. ఆహహా..


దాహాల చెరువుల్లో.. సరసాల వానల్లో

విరహాలు.. కలహాలు.. 

కమ్మని ప్రేమకు చిగురులు..

ఎవరు ఎవరో తెలియకుండా.. 

ఒకరినొకరు కలుసుకొనుట....

చిత్రం.. విచిత్రం..


చరణం 2 :


అడుగులోన అడుగు వేసి.. 

ఏడడుగులు నడుస్తుంటే..

ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. 

జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం..


ఆరుబయట చందమామ 

రారమ్మని పిలుస్తుంటే..

ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. 

పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం..


తారలన్ని తోరణాలై.. తొలి రాతిరి కాపు కాస్తే..

మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం..

సిగ్గు విడిచి చీకటంత.. నవ్వి నవ్వి తెల్లవార్చితే...

స్వర్గం.. స్వర్గం..


స్వప్నాల మైకం లో..  స్వర్గాల ఊయలలో..

రాగాలు.. భావాలు.. కమ్మని కాపురాన కబురుళ్లు...


ఎవరు ఎవరో తెలియకుండా.. 

ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..

చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..

చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే...

చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..


పాటల ధనుస్సు  


7, మార్చి 2022, సోమవారం

తామర పువ్వంటి తమ్ముడు కావాలా | Tamara Puvvanti | Song Lyrics | Bangaru Kanuka (1982)

తామర పువ్వంటి తమ్ముడు కావాలా 



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : వేటూరి 

నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


ఈ మహరాణి నా గృహరాణి


ఈ మహరాణి నా గృహరాణి


దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


చరణం 1 :


ఇల్లేలే ఇల్లాలు వెదజల్లే అందాలు


కలబోసిన అమ్మాయి ఈ ఏడే పుట్టాలి


నన్నేలే శ్రీవారు మురిపించే సరసాలు


మరిపించే అబ్బాయి తమ భరతం పట్టాలి


మా అమ్మలు ఆటకి అమ్మా నాన్న బొమ్మలు కావాలి


అమ్మా నాన్న నాకో తమ్ముడు ఇప్పుడే కావాలి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా



చరణం 2 :


మా పాపే యువరాణి... మా ఇల్లే ఒక రాజ్యం


ఆ మాటే ధర్మానా... కాదంటే జరిమాణా


కంటావా మహరాణి... కావాలి ఒక సైన్యం


పెద్దైనా చినదానా... నీ ప్రేమే నజరానా 


ఇద్దరు లేకా ముగ్గురన్నది హద్దు ఎవరికైనా


ముద్దుల తమ్ముని ఇవ్వక పోతే మీకే జిల్లాయి


తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


ఈ మహరాణి నా గృహరాణి


దయ ఉంచి ఇద్దర్ని ఇవ్వాలా


నా మదినేలే ఈ మహరాజు 


దయ ఉంటే ఇద్దర్ని ఇస్తానే



తామర పువ్వంటి తమ్ముడు కావాలా 


చామంతి పువ్వంటి చెల్లాయి కావాలా


- పాటల ధనుస్సు 

6, మార్చి 2022, ఆదివారం

ప్రేమ బృందావనం | Prema Brindavanam | Song Lyrics | Bangaru Kanuka (1982)

ప్రేమ బృందావనం



చిత్రం : బంగారు కానుక (1982)

సంగీతం :  సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం : ఆనంద్, సుశీల


పల్లవి :


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..

ఆ రాముడు నా వరుడిగా...  చేరగా..

ప్రేమ బృందావనం ...


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..

ఆ సీతే నా వధువుగా...  చేరగా

ప్రేమ బృందావనం.... 



చరణం 1 :



పెళ్ళికే పాల మబ్బు పందిరే వేసెనయ్యా..

పచ్చనీ తీగలన్ని తోరణం చేసెనయ్యా ...

తారలే తలంబ్రాలై కురిసేనయ్యా ...


నా...కన్నులా...కళ్యాణజ్యోతుల కాంతులు మెరిసే ...

ప్రేమ బ్రందావనం పలికెలే స్వాగతం...


చరణం 2 :


గాలికే నీ అందం...  కవితలే నేర్పెనమ్మా...

వీణకే నీ గానం...  స్వరములే తెలెపెనమ్మా..

చందమామ నీ ముందూ ఎందుకే బొమ్మా....


ఆ...అమ్మమ్మా.... అపురూప సుందర అప్సర నీవు...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...


చరణం 3 :


పాలలో తేనెవలే మనసులే కలిసెనయ్యా...

కలిపిన కొంగులు రెండూ విడిపోవమ్మా...

మా.. జంటనే ... దీవించగా.. గుడి గంటలు మ్రోగే..


ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...

ఆ రాముడు నా వరుడిగా చేరగా..

ప్రేమ బృందావం...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు