ఎన్నో ఊహలు ఎన్నో తలపులు
చిత్రం : మధుర స్వప్నం (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఎన్నో ఊహలు.. ఎన్నో తలపులు.. ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై.. రేపటి వెలుగై.. ఎదలో మెదలెను
ఎన్నో ఊహలు.. ఎన్నో తలపులు.. ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై.. రేపటి వెలుగై.. ఎదలో మెదలెను
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
చరణం 1 :
తొలిముద్దున తొనికిన స్వప్నం
నడిపొద్దున నలిగిన స్వప్నం
కలురెప్పల కౌగిళ్ళలో కలబోసిన కమ్మని స్వప్నం
తొలిముద్దున తొనికిన స్వప్నం
నడిపొద్దున నలిగిన స్వప్నం
కలురెప్పల కౌగిళ్ళలో కలబోసిన కమ్మని స్వప్నం
నీలోన సగము నాలోన సగము
ఒకటైన రూపం... మన ప్రేమ దీపం
ఎన్నో ఊహలు.. ఎన్నో తలపులు.. ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై.. రేపటి వెలుగై.. ఎదలో మెదలెను
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
చరణం 2 :
మురిపాల ముద్దుల మూటై
విరబూచిన నవ్వుల తోటై
హృదయాల ఉయ్యాలలో ఎదిగొచ్చే అల్లరి ఆటై
మురిపాల ముద్దుల మూటై
విరబూచిన నవ్వుల తోటై
హృదయాల ఉయ్యాలలో ఎదిగొచ్చే అల్లరి ఆటై
తొలి జోల పాటై... మన కంటి పాపై
నడయాడు బాబు... పుడతాడు రేపు
ఎన్నో ఊహలు.. ఎన్నో తలపులు.. ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై.. రేపటి వెలుగై.. ఎదలో మెదలెను
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
మధుర స్వప్నం... మన మధుర స్వప్నం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి