RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
radha krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
radha krishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2024, శుక్రవారం

అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను | Appudeppudeppudo | Song Lyrics | Radha Krishna (1978)

అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను



చిత్రం :  రాధాకృష్ణ (1978)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


ఏప్పుడో....


అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను...  

నిన్నేనా జాంపండు

నువ్వేనా నా జాంపండు...  

నువ్వేనా ఆ జాంపండు


ఇప్పుడే....


ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న...  

నువ్వేనా మొద్దబ్బాయి

నువ్వేనా ఆ మొద్దబ్బాయి...  

నువ్వేనా నా మొద్దబ్బాయి



చరణం 1 :


కొలను నేనుంటే కలువపూలు కోస్తుంటే

చేరుకోబోయినప్పుడు నువ్వు జారినప్పుడు... 

ఆ జారినప్పుడు...

నిన్ను ఎలా ఎత్తుకొన్నానో గుర్తుందా... 

గుర్తుందా..


అరటిపండు పట్టుకొని ఆలయంలో నువ్వుంటే..

గండుకోతి పండును కాజేసినప్పుడు... 

కాజేసినప్పుడు

నువ్వెలా అదిరిపోయావో గుర్తుందా... 

గుర్తుందా..


అన్నీ గుర్తేకాని అమ్మడూ.. ఆ...

చిట్టి అమ్మడూ... ఉహు...

ఈ వంపులేడ దాచావో అప్పుడు..హా..హా....


ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడే చూస్తున్న 

నువ్వే నా మొద్దబ్బాయి... హా

నువ్వేనా ఆ మొద్దబ్బాయీ... 

నువ్వేనా ఆ జాంపండు


చరణం 2 :


బడికి నువ్వు రానంటే మెడపట్టి ఈడ్చుకొస్తే

పంతులయ్య బరితపూజ చేసినప్పుడు... 

ఆ చేసినప్పుడు...

నువ్వెలా తుర్రుమన్నావో గుర్తుందా... 

గుర్తుందా..


నువ్వు తినే జాంపండు నేను కాస్త లాక్కోని

ఉరిస్తు ఊరిస్తు తినేటప్పుడు... 

ఆ తినేటప్పుడూ..

నువ్వెలా మొహం పెట్టవో గుర్తుందా... 

ఆ... గుర్తుందా..


అన్నీ గుర్తే కాని కృష్ణుడు..చిన్ని కృష్ణుడు..

ఆ చిలిపితనం పోలేదే ఇప్పుడు...హా...


అప్పుడెప్పుడెప్పుడెప్పుడో చూశాను 

నిన్నేనా జాంపండు

నువ్వేనా నా జాంపండు...  

నువ్వే నా ఆ మొద్దబ్బాయి

ఆ..నువ్వే నా నా జాంపండు... 

నువ్వే నా నా మొద్దబ్బాయి


పాటల ధనుస్సు 

24, జులై 2022, ఆదివారం

రాధా విలాపం | బృందావనం | Radha Vilapam song Lyrics | Brindavanam Album | RKSS Creations

 రాధా విలాపం : వ్రేపల్లె విడచినా గోవుల్ని మరచినా


గీత రచన : రామకృష్ణ దువ్వు 

సంగీతం : S వేణుమాధవ్ 

కీబోర్డ్ : Ch పవన్ కుమార్ 

గాత్రం : ఘట్టి శ్రీవిద్య 

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ స్టూడియో, విశాఖపట్నం,

ఆల్బం : బృందావనం,

ప్రొడ్యూసర్స్ : RKSS Creations.

 

పల్లవి:

వ్రేపల్లె విడచినా గోవుల్ని మరచినా

ఈ రాధ మనసు వీడలేవు మాధవా

కన్నులు నావైనా.. చూపులు నీవిరా..

తనువే నాదైనా .. తలపులు నీవిరా..

మాధవా.. మాధవా.. మాధవా.. మాధవా..

 

చరణం:

రాధామాధవుల ప్రణయ వసంతాన

చిగురించిన తరువులు ఆనాడు

రాధ నిలా కాంచి నేడు శిశిరమై నాయి

నీ పిల్లనగ్రోవి శృతిలో గొంతు కలిపి కోయిలా

కుహు కుహు మన్నది ఆనాడు..

నీవులేని నన్ను గాంచి మూగవోయినాది..

ప్రకృతే నీవులేక మరిమరి విలపించగా..

నీవే ప్రాణమైన ఈ రాధ బ్రతుకగలదా

 

చరణం:

రాధాకృష్ణుల సరస రాసక్రీడలో..

పురివిప్పిన మయూరాలు నాడు

నీవు లేక కన్నీటి కడలి అయ్యాయి..

నీ నగుమోముతోను రాగమొలుకు చూపులతో

ముద్దుగొలుపు మాటలతో

నా హృదయమే దొంగిలించుకెళ్ళావు..

నా అసువులను నీతోటే తీసుకెళ్ళి పోయావు

నీ రాధ ఈ వనములో ఒక తరువుగా మిగిలుంది..

 

- రామకృష్ణ దువ్వు

6, మార్చి 2022, ఆదివారం

నీ వలపే బృందావనం | Nee Valape Brindavanam | Song Lyrics | Radha Krishna (1978)

నీ వలపే బృందావనం



చిత్రం :  రాధాకృష్ణ (1978)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

నేపథ్య గానం :  బాలు, సుశీల

గీత రచన : దాశరధి 


పల్లవి :


రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

నీ వలపే బృందావనం.... 

నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో...  తేలి ఆడాలిలే 


నీ వలపే బృందావనం... 

నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో... తేలి ఊగాలిలే


చరణం 1:


కొంటె కృష్ణుని కులుకు చూపులో...  

కళ్యాణ కాంతులు మెరిశాయిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో...  

కళ్యాణ కాంతులు మెరిశాయిలే


నా రాధ నడకలో ఈ వేళా... 

నవ వధువు తడబాటు కనిపించెలే 

రంగైన వజ్రాల పందిరిలో... 

రతనాల తలంబ్రాలు కురిసేనులే

రతనాల తలంబ్రాలు కురిసేనులే .. 

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...


చరణం 2:


రాధా కృష్ణుల అనురాగాలు...  

మనలో రాగాలు నిలపాలిలే

రాధా కృష్ణుల అనురాగాలు...  

మనలో రాగాలు నిలపాలిలే


నీవు నేనూ జీవితమంతా  

నవరాగ గీతాలు పాడాలిలే

మన హృదయాలు పూల నావలో 

మధుర తీరాలు చేరాలిలే

మధుర తీరాలు చేరాలిలే..


రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

నీ వలపే బృందావనం.... 

నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో...  తేలి ఆడాలిలే 


రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...

రాధా......ఆ... ఆ... కృష్ణా.......ఆ... ఆ...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు