రాధా విలాపం : వ్రేపల్లె విడచినా గోవుల్ని మరచినా
గీత రచన : రామకృష్ణ దువ్వు
సంగీతం : S వేణుమాధవ్
కీబోర్డ్ : Ch పవన్ కుమార్
గాత్రం : ఘట్టి శ్రీవిద్య
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ స్టూడియో, విశాఖపట్నం,
ఆల్బం : బృందావనం,
ప్రొడ్యూసర్స్ : RKSS Creations.
పల్లవి:
వ్రేపల్లె విడచినా గోవుల్ని మరచినా
ఈ రాధ మనసు వీడలేవు మాధవా…
కన్నులు నావైనా.. చూపులు నీవిరా..
తనువే నాదైనా .. తలపులు నీవిరా..
మాధవా.. మాధవా.. మాధవా.. మాధవా..
చరణం:
రాధామాధవుల ప్రణయ వసంతాన
చిగురించిన తరువులు ఆనాడు
రాధ నిలా కాంచి నేడు శిశిరమై నాయి
నీ పిల్లనగ్రోవి శృతిలో గొంతు కలిపి
కోయిలా
కుహు కుహు మన్నది ఆనాడు..
నీవులేని నన్ను గాంచి మూగవోయినాది..
ప్రకృతే నీవులేక మరిమరి విలపించగా..
నీవే ప్రాణమైన ఈ రాధ బ్రతుకగలదా…
చరణం:
రాధాకృష్ణుల సరస రాసక్రీడలో..
పురివిప్పిన మయూరాలు నాడు
నీవు లేక కన్నీటి కడలి అయ్యాయి..
నీ నగుమోముతోను రాగమొలుకు చూపులతో
ముద్దుగొలుపు మాటలతో …
నా హృదయమే దొంగిలించుకెళ్ళావు..
నా అసువులను నీతోటే తీసుకెళ్ళి పోయావు
నీ రాధ ఈ వనములో ఒక తరువుగా
మిగిలుంది..
- రామకృష్ణ దువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి