RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, జులై 2022, శనివారం

ఆనాడు ఈనాడు ఏనాడు | Anadu Enadu Yenadu | Song Lyrics | Tayaramma Bangarayya (1979)

ఆనాడు ఈనాడు ఏనాడు



చిత్రం : తాయారమ్మ-బంగారయ్య (1979)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం : జి. ఆనంద్, సుశీల



పల్లవి :


ఆనాడు ఈనాడు ఏనాడు

ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు

ఆడించాడు ఆడకపోతే పీడించాడు

అడుగుల మడుగులు ఒత్తించాడు 

మగవాడే.. మన పగవాడు


ఆనాడు ఈనాడు ఏనాడుఆడదాన్ని 

ఆట బొమ్మగా చేశాడు మగవాడు




చరణం 1 :




ఒకడు అమ్ముకుపోయాడు... 

ఒకడు అడవికి పంపాడు

ఒకడేమో జూదంలో పందెం కాసాడు

తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు

తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు

ఏ మగవాడు ఏ మగువని 

మనసున్నదిగా చూసాడు

మగవాడే...  మన పగవాడు

మగవాడే...  మన పగవాడు

ఆనాడు ఈనాడు ఏనాడు

ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు



NO... ఆనాడు ఈనాడు ఏనాడు 

ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు

ప్రేమించాడు దేవత నీవని పూజించాడు

పరువు బ్రతుకు నీవన్నాడు 

మగవాడే బలి పశువయ్యాడు

 ఆనాడు ఈనాడు ఏనాడు 

ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు


చరణం 2 :


నెత్తిన కూర్చుంది ఒకతి

నెత్తిన తన్నింది ఒకతి

ఒకతేమో శపథం చేసి యుద్ధం చేసింది

నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది

తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది

ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?

మగవాడే బలి పశువయ్యాడు

మగవాడే బలి పశువయ్యాడు



ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని 

ఆట బొమ్మగా చేసాడు మగవాడు


చరణం 3 :


సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు

సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు

యుగయుగాల మీ బానిసే ఆడది

యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు