ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి
చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాదవపెద్ది సురేశ్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు , జానకి
పల్లవి :
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది...
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది...
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
చరణం 1 :
ఆ రోజు జాబిల్లి పగలే వచ్చింది...
ఈ రోజు జాజుల్లో సెగలే తెచ్చింది
ఆ రోజు ఓ చూపు వలలే వేసింది...
ఈ రోజు మాపుల్లో కలలే తోచింది
కన్నులే వెన్నెలాయే... వన్నెలే వెన్నలాయే
ముద్దులా ముచ్చటాయే నిద్దరే పట్టదాయే
ఈ రోజే నాకు తెలిసింది...
ఈ చిత్రాలు చేసింది లవ్వని
మధు పత్రాలు రాసింది లవ్వని...
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది...
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
చరణం 2 :
ఆ రోజు కలలోన తొణికే ఓ ప్రేమ...
ఈ రోజు ఇలలోన నిజమే చేద్దామా
ఆ రోజు మెరిసింది అందం చిరునామా...
ఈ రోజు కలిసింది జతగా ఈ భామ
గుండెలో అల్లరాయే.... ఎండలే చల్లనాయే
ఆశలే వెల్లువాయే.... ఊసులే చల్లిపోయే
ఈ రోజే నాకు తెలిసింది...
రాగాలు రేపింది లవ్వని
అనురాగాలు చూపింది నువ్వని...
ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది...
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి...
అనుకున్నా ఏదో నవ్వని
ఈ రోజే నాకు తెలిసింది...
ఆ నవ్వున దాగుంది లవ్వని
ఎద జివ్వున లాగింది లవ్వని
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి