ఇంద్రధనసు ఇల్లాలై
చిత్రం : ఇంద్రధనస్సు (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఇంద్రధనసు ఇల్లాలై
ఇంటివెలుగు అయ్యిందీ
ఇంద్రధనసు ఇల్లాలై
ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ..
నా లోకమైనదీ
ఇంద్రధనసు ఇల్లాలై
ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ
నా లోకమైనదీ
చరణం 1 :
ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవే
ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవై
ఎదలో నిండగా .. బ్రతుకే పండగా
ఇంద్రధనసు ఇల్లాలై
ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ
నా లోకమైనదీ
చరణం 2 :
పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను
పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను
తపసే నాదిగా .. వరమే నీవుగా
ఇంద్రధనసు ఇల్లాలై
ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ
నా లోకమైనదీ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి