RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
prema bandham songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
prema bandham songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఏప్రిల్ 2024, ఆదివారం

ఏ జన్మకైనా ఇలాగే ఉందామా | Ye Janmakaina Ilage Vundama | Song Lyrics | Prema Bandham (1976)

ఏ జన్మకైనా ఇలాగే ఉందామా



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  : సుశీల, బాలు 


పల్లవి :


ఏ జన్మకైనా ఇలాగే ఉందామా

నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై

ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా 


చరణం 1 :


నీరెండకే నీ మోము కందిపొవునో

నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా

నీరెండకే నీ మోము కందిపొవునో

నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా


నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో

నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో

నా నీలి కురులే తెరలుగా నిను దాచుకోనా 


ఏ జన్మకైనా ఇలాగే ఉందామా

నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై

ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా 


చరణం 2 :


వేయిరాత్రులు కలుసుకున్నా... 

విరిశయ్యకు విరహమెందుకో

కోటి జన్మలు కలిసి వున్నా... 

తనివి తీరని తపన ఎందుకో

విరిశయ్యకు విరహమెందుకో...  

తనివి తీరని తపన ఎందుకో

హృదయాల కలయికలో ఉదయించే తీపి అది

హృదయాల కలయికలో ఉదయించే తీపి అది

జీవితాల అల్లికలో చిగురించే రూపమది 


ఏ జన్మకైనా ఇలాగే ఉందామా

నేను నీ దాననై...  నీవు నా ధ్యానమై

ఇలా ఇలా ఇలా...  ఇలా ఇలా ఇలా


పాటల ధనుస్సు 


పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే | Puvvula Navvithe | Song Lyrics | Prema Bandham (1976)

పువ్వులా నవ్వితే మువ్వలా మోగితే



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  : సుశీల, బాలు 


పల్లవి :


పువ్వులా నవ్వితే...  మువ్వలా మోగితే

గువ్వలా ఒదిగితే... రవ్వలా పొదిగితే

నిన్ను నేను నవ్విస్తే ... అ... అ

నన్ను నువ్వు కవ్విస్తే ... అ.. అ

అదే ప్రేమంటే.. అదే..అదే..అదే..అదే        


చరణం 1 :


అంతలోనే మాట ఆగిపోతుంటే

తనకు తానే పైట జారిపోతుంటే

అంతలోనే మాట ఆగిపోతుంటే

తనకు తానే పైట జారిపోతుంటే 


గుండెలో చల్లని ఆవిరి గుసగుస పెడుతుంటే

గుండెలో చల్లని ఆవిరి గుసగుస పెడుతుంటే

తడవ తడవకూ పెదవుల తడియారి పోతుంటే

ఎండలో చలి వేస్తే....  వెన్నెల్లో చెమరిస్తే 


అదే... అదే..

అదే.. ప్రేమంటే..అదే అదే... అదే.. అదే  


చరణం 2 :


కందిన చెక్కిలి కథలేవో చెబుతుంటే

అందని కౌగిలి ఆరాటపెడుతుంటే

కందిన చెక్కిలి కథలేవో చెబుతుంటే

అందని కౌగిలి ఆరాటపెడుతుంటే


కాటేసిన వయసేమో కంటి కునుకునే కాజేస్తుంటే

కాటేసిన వయసేమో కంటి కునుకునే కాజేస్తుంటే

మాటేసిన కోరికలే వేటాడుతూ వుంటే

ఇద్దరూ ఒకరైతే...  ఆ ఒక్కరూ మనమైతే 


అదే...  ప్రేమంటే.. అదే... అదే..  అదే అదే

అదే అదే.... లల.. లల... లల


పాటల ధనుస్సు 


13, ఏప్రిల్ 2024, శనివారం

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి | Cheredetako Telisi | Song Lyrics | Prema Bandham (1976)

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి:


ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁహూఁ

లాల లార రరా..రా.రా..రా..రా ఊఁహూఁ..


చేరేదెటకో తెలిసి.. చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకో..ఓ..ఓ..ఓ 

తెలిసి..తెలిసి..తెలిసి


కలవని తీరాల నడుమ.. 

కలకల సాగక యమునా

వెనుకకు తిరిగి పోయిందా... 

మనువు గంగతో మానిందా?

ఊఁ..ఊఁహూఁ.. ఊఁహూ..

చేరేదెటకో తెలిసి ..చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ

తెలిసి..తెలిసి..తెలిసి..



చరణం 1:


జరిగిన కథలో బ్రతుకు తెరువులో.. 

దారికి అడ్డం తగిలావూ..ఊ..ఊ

ముగిసిన కథలో మూగ బ్రతుకులో..ఓ.. 

నా దారివి నీవై మిగిలావూ..ఊ


పూచి పూయని పున్నమలో.. 

ఎద దోచి తోడువై పిలిచావు

గుండెలు రగిలే ఎండలలో.. 

నా నీడవు నీవై నిలిచావు

ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ



చేరేదెటకో తెలిసి.. 

చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ

తెలిసి..తెలిసి... తెలిసి..


చరణం 2:


తూరుపు కొండల తొలి తొలి సంధ్యల... 

వేకువ పువ్వు వికసిస్తుందీ..ఈ..ఈ..ఈ


విరిసిన పువ్వూ..ఊ..ఊ.. కురిసిన తావి...

విరిసిన పువ్వూ... కురిసిన తావి

మన హృదయాలను వెలిగిస్తుంది..ఈ..ఈ..ఈ

చీకటి తెరలు తొలిగిస్తుంది


ఊఁహుఁ..ఊఁహూఁ..అహ అహా..ఆహ ఆహా...ఆ..ఆ


పాటల ధనుస్సు 


అంజలిదే గొనుమా ప్రియతమా | Anjalide gonuma | Song Lyrics | Prema Bandham (1976)

అంజలిదే గొనుమా... ప్రియతమా



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  : సుశీల 


పల్లవి :


అంజలిదే గొనుమా ప్రియతమా.. 

మంజుల బృందా నికుంజ నిరంజన

అంజలిదే గొనుమా ప్రియతమా.. 

మంజుల బృందా నికుంజ నిరంజన

అంజలిదే గొనుమా ...


చరణం 1 :


గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. 

బుజ్జగించి లాలించి సొగసిడి

గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. 

బుజ్జగించి లాలించి సొగసిడి 


ముజ్జగాలకే ముద్దబంతిగా..

ముజ్జగాలకే ముద్దబంతిగా.. 

మలచిన దేవా... మహానుభావ

అంజలిదే గొనుమా... ప్రియతమా


చరణం 2 :


నిండు కొలువులో పాండవ కాంతకు.. 

వలువలూడ్చుతరి వనిత మొరవిని

నిండు కొలువులో పాండవ కాంతకు.. 

వలువలూడ్చుతరి వనిత మొరవిని


మానము గాచి...  మానిని బ్రోచిన..

మానము గాచి...  మానిని బ్రోచిన..  

మాధవ దేవా... మహానుభావా...  


అంజలిదే...  గొనుమా


చరణం 3 :


బృందావనిలో చందమామవై.. 

చెలువల కలువల జేసి రమించి

బృందావనిలో చందమామవై ..

చెలువల కలువల జేసి రమించి


బిసజపత్ర జల బిందువువై..

బిసజపత్ర జల బిందువువై...  

ఇల మసలిన దేవా


మహానుభావా .. అంజలిదే గొనుమా


పాటల ధనుస్సు 



10, ఏప్రిల్ 2024, బుధవారం

అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా | Ammamamamma Allari pidugamma | Song Lyrics | Prema Bandham (1976)

అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  : సుశీల, బాలు 


పల్లవి :


అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా... 

అయ్యో రామా చెపితే వినడమ్మా

చోటుకాని చోట అల్లరి చేటంటే వినడు

ఒదిగి ఉండమంటే ఎదలో ఎదిగి ఎదిగి పోతాడు

అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా... 

అయ్యోరామా చెపితే వినడమ్మా  


చరణం 1 :

ఆ...హా ఆ.... హా ఆ.. హా

నేనడిగానా ఆ చోటు... ఆహా ఆహా ఆహా

నీదేనమ్మ పొరపాటు...  పాపం

దాచుకున్న సొగసు చూసి...  ఊహు హా  అబ్బ

దాగని నీ వయసు చూసి ...ఆ... ఆ...  ఆ

ఛీ ... పాడు 


అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా....  

అయ్యోరామా చెపితే వినడమ్మా 


చరణం 2 :


తీపి తీపిగా పెదవులు తడిపిందెవరమ్మా?

తేనె దొంగకు ఏ పూవో తేరగా దొరికిందమ్మా

చెక్కిలి పై గాటేమిటి చిలకమ్మా?

పోతుటీగ కాటేసింది ఓయమ్మా

చిన్నగాటుకే చెదిరిపోతే ఎట్టాగమ్మా...  

రేపెట్టాగమ్మా

తేనెపట్టుకు చేరినప్పుడు చెబుతానమ్మా...  

అప్పుడే చెబుతానమ్మా... ఇప్పుడే చెప్పాలి


అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...  

ఊహు ఊహు ఆహా  అబ్బబ్బ


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు